మణికర్ణికని కాపాడలేకపోతున్నారు: వరుస లీకులతో పిచ్చెక్కిపోతున్న క్రిష్?

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న కొత్తచిత్రం 'మణికర్ణిక' షూటింగ్ ఎంత సీక్రెట్ గా జరిపినా కూడా సెట్స్ లోని ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.

Recommended Video

వరుస లీకులతో పిచ్చెక్కిపోతున్న క్రిష్

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న కొత్తచిత్రం 'మణికర్ణిక'. ఇందులో సోనుసూద్, సురేష్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‎లుక్ ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ సినిమా సెట్‎లో తీసిన పలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయి తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ

ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ

బాలీవుడ్ భామ కంగ‌నార‌నౌత్ ప్రస్తుతం మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగం షూటింగ్ ని కూడా పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ఇన్ని రోజులు కంగనా కు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేయలేదు. కానీ అనధికారికంగా తీసిన ఫొటోలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి.

 ఝాన్సీ లక్ష్మీభాయ్‎గా చీరకట్టులో

ఝాన్సీ లక్ష్మీభాయ్‎గా చీరకట్టులో

సినిమాను తెరకెక్కిస్తున్న క్రిష్ కంగనాకు స్క్రిప్ట్ చెబుతున్నట్లుగా ఒక ఫొటోలో కనిపిస్తుండగా.. మరో ఫొటోలో ఝాన్సీ లక్ష్మీభాయ్‎గా చీరకట్టులో కంగనా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు యుద్ధ సన్నివేశాలను రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో చిత్రీకరిస్తున్నారు.

 కంగనా కు సంబదించిన పిక్స్

కంగనా కు సంబదించిన పిక్స్

షూటింగ్ త్వరగా పూర్తిచేసి వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది చిత్రయూనిట్ ఈ మూవీ లోని కంగనా కు సంబదించిన పిక్స్ ఏవి విడుదల చేయకుండా చాలజాగ్రత్త పడుతూ వస్తుంది. కానీ ఈ పిక్స్ సోషల్ మీడియా లో లీక్ కావడం పట్ల చిత్ర యూనిట్ షాక్ లో పడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సినిమాలో కంగన పాత్రకు తగ్గట్టుగా చాలా సింపుల్ గా ఉన్నట్లు ఈ పిక్స్ చూస్తే అర్ధం అవుతుంది.

ఈ పిక్స్ ఎవరు లీక్ చేసారు?

ఈ పిక్స్ ఎవరు లీక్ చేసారు?

జైపూర్ లో వేసిన ఒక సెట్ లో డైలాగ్స్ చెబుతూ కనిపించింది. అలాగే దర్శకుడు క్రిష్ కూడా ఆమెకు సహాయం చేస్తున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఇంతకీ ఈ పిక్స్ ఎవరు లీక్ చేసారు అనే కోణం లో చర్చలు జరుపుతున్నారు.ప్రస్తుతం ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

 బిజినెస్ కూడా భారీ స్థాయిలో

బిజినెస్ కూడా భారీ స్థాయిలో

అంతే కాకుండా కంగాన రనౌత్ ఝాన్సీ రాణి పాత్రలో కనిపిస్తుండడంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో ఉంటుందని ఇప్పటికే సినీ అనలిస్ట్ లు అంచనాలను వేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా క్రేజ్ ఏ విధంగా ఉందంటే.. సినిమా షూటింగ్ ఎంత సీక్రెట్ గా జరిపినా కూడా సెట్స్ లోని ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.

మరికొన్ని ఫొటోస్

మరికొన్ని ఫొటోస్

లాస్ట్ వీక్ కూడా ఇదే తరహాలో షూటింగ్ కి సంబందించిన ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి. గోల్డెన్ సారి లో కంగనా చాలా సింపుల్ గా కనిపించింది. ఇక రీసెంట్ గా మరికొన్ని ఫొటోస్ కూడా లీకవ్వడంతో మీడియాల్లో అనేక కథనాలు వెలువడుతున్నాయి. గ్రీన్ కలర్ డ్రెస్ లో జైపూర్ లో వేసిన ఒక సెట్స్ లో కంగనా నడుచుకుంటు వెళుతోంది.

కంగనా చాలా మారింది

కంగనా చాలా మారింది

ఎవరో కొన్ని పోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫొటోని చూస్తుంటే పాత్ర కోసం కంగనా చాలా మారింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కాని.. అసలు మనోళ్ళు కంగన ఫోటోలను లీక్ అవ్వకుండా కాపాడలేకపోవడమే ఇక్కడ విడ్డూరంగా ఉంది. ఆ మాత్రం సెక్యూరిటీ చూసుకోకపోతే ఎలాగయ్యా?

కంగాన కూడా శిక్షణను తీసుకొంది

కంగాన కూడా శిక్షణను తీసుకొంది

ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ త్వరలోనే కొన్ని భారీ యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించనుందట. అందుకోసం కంగాన కూడా శిక్షణను తీసుకొంది. ఈ సినిమాలో సోను సూద్ - అంకిత లోఖండే కూడా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X