పవన్, మహేష్ లు తో ఆమెకు...
ఏక్ నిరంజన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న కంగనా రౌనత్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ ప్రాపర్టీగా మారింది. తెలుగు హీరోలంతా ఆమె కోసం ఎగబడుతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి. అందరికన్నా ముందు రేస్ లో ఉన్నది తరుణ్ అని తెలుస్తోంది. అతను డేట్స్ కోసం అడిగిన వారికి కంగనాని పెట్టుకుంటే మిగతావి ఆలోచించవచ్చు..రెమ్యునేషన్ లో కూడా డిస్కౌంట్ ఇస్తాను అని ప్రకటనలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక సుశాంత్, మంచు మనోజ్ లు కూడా ఆమెను తమ సినిమాల్లో తీసుకునేందుకు మేనేజర్ ని సంప్రదిస్తే...అతను ఆమెకు టాలీవుడ్ లో ఆసక్తి లేదని తేల్చసాడట. అయితే మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ లతో చేయటానికి ఆమె ఉత్సాహం చూపుతోందని ఆ దిసగా ఆమె పావులు కదుపుతోందని తెలుస్తోంది. పూరి జగన్నాధ్ ఇచ్చే గైడన్స్ తో తెలుగులో ఈ స్టార్ హీరోలను ఎప్రోచ్ అవుతోందని తెలుస్తోంది.అయితే ఈ ఇద్దరూ తమకు ఈమెపై ఆసక్తి లేదనట్లుగా చూద్దాం అని ప్రక్కన పెట్టారు. దాంతో తనని కోరుకున్న వారి దగ్గరకు వెళ్ళటం మేలా..లేక తను కోరుకున్న వారితో సినిమాలు చేయటం బెస్టా అని అనే డైలమాలో ఆమె ఉందని వినపడుతోంది.


Click it and Unblock the Notifications











