Kamal Haasan vs Kangana Ranaut: మహిళలకు వెల కడతారా? కమల్‌పై క్వీన్ ఫైర్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ ట్వీట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రముఖ నటి కంగన రనౌత్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కమల్ చేసిన ప్రతిపాదన మహిళల సేవలను కించపరచడమే అంటూ తన వాదనను వినిపించింది. అయితే ఈ వాదనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తాజా వివాదంలోకి వెళితే...

వంటింటి మహరాణులకు వేతనం
ఇంటి బాధ్యతలను నిర్వర్తించే మహిళల ఇంటి పనిని వేతనం కూడిన ఉద్యోగంగా భావించాలి. అలాంటి హోం మేకర్స్‌కు ప్రభుత్వాలు నెలసరిగా కొంత మొత్తాన్ని అందించాలి. ఇళ్లు అనే సామ్రాజ్యాన్ని పాలించే క్వీన్స్‌కు ఇది సముచితమైన గౌరవం. మహిళాశక్తికి, సాధికారితకు గౌరవం కల్పించినట్టు అవుతుంది అని కమల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కమల్ ట్వీట్‌కు శశిథరూర్ సమర్ధన
కమల్ హాసన్ ట్వీట్‌ను సమర్ధిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు. కమల్ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాను. మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి అండగా నిలిచినట్టు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు బేసిక్ ఆదాయాన్ని ఇచ్చినట్టు ఉంటుంది అని శశి థరూర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కమల్, శశిథరూర్ ట్వీట్‌పై కంగన ఫైర్
మహిళలు అనే ట్యాగ్ చూపి వారిపై వివక్ష చూపకండి. మా ప్రేమను, ఇంటిపై బాధ్యతలకు వెలకట్టకండి. ఇంటిని ఓ సామ్రాజ్యంగా భావించే మహిళలకు జీతంతో వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయకండి. ప్రతీ విషయాన్ని వ్యాపార కోణంలో ఆలోచించకండి. ప్రేమ, గౌరవం, జీతం లాంటి విషయాలను పక్కన పెట్టి మహిళకు అన్ని రకాలుగా దాసోహం అనాల్సిందే అంటూ కంగన అన్నారు.

తల్లి సేవలకు వెలకడుతారా?
మహిళల బాధ్యతలను ఇంటి సంరక్షకురాలిగా నుంచి ఇంటి ఉద్యోగిగా మార్చడం చాలా దారుణం. మహిళల త్యాగాలకు జీతంతో వెలకట్టడం మరింత దారుణం. ఎలాంటి ప్రయోజనాలను ఆశించకుండా జీవితం కాలం సేవలు అందించే తల్లుల వేతనం చెల్లిస్తారా? తల్లి సేవలనేవి దేవుడు సృష్టించిన గొప్ప కార్యం. అలాంటి సేవలకు వెలకట్టాలనే కమల్ ఆలోచన కొంత బాధగా ఉంది మరి కొంత ఫన్నీగా ఉందంటూ కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications











