twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రిష్ ఓ ఫూల్.. రాబందు.. బాలయ్యను చూస్తే బాధగా ఉంది, ఆయన కెరీర్‌కే మాయని మచ్చ.. కంగన ఫైర్

    |

    బాలీవుడ్ నటి కంగన రనౌత్ మరోసారి దర్శకుడు క్రిష్ జాగర్లమూడిపై నిప్పులు చెరిగింది. మణికర్ణిక దర్శకత్వం టైటిల్ వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే.. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్‌పై తనదైన శైలిలో కామెంట్లు చేసింది. మణికర్ణిక చిత్రానికి దర్శకత్వం వహించే సమయంలో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ కోసం మధ్యలోనే ప్రాజెక్ట్‌ను వదిలేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దర్శకురాలిగా మారి మణికర్ణిక సినిమాను కంగన రనౌత్ పూర్తి చేసింది. డైరెక్టర్ పేరును క్రిష్ కాకుండా తన పేరునే వేసుకోవడం వివాదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు కంగన రనౌత్ ఘాటుగా స్పందించింది. కంగన ఏమన్నారంటే..

     బాలకృష్ణను చూస్తే బాధేస్తుంది

    బాలకృష్ణను చూస్తే బాధేస్తుంది

    ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు పెట్టిన డబ్బు కూడా రాలేదని చదివాను. బాలకృష్ణ లాంటి హీరో కెరీర్‌కే మచ్చగా మారింది. బాలకృష్ణ సార్‌ను చూస్తే బాధగా ఉంది. పాపం క్రిష్‌ను పూర్తిగా నమ్మి జీవితాన్నే పణంగా పెట్టాడు అని కంగన పేర్కొన్నది.

    రాబందులా వేధించాడు

    రాబందులా వేధించాడు

    ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ నేపథ్యంలో క్రిష్ టార్గెట్ చేసుకొని కంగన ధ్వజమెత్తింది. మణికర్ణిక సినిమా విషయంలో రాబందులా వేధించిన క్రిష్‌కు తగిన సమాధానం చెప్పే సమయం వచ్చింది. ఈ సినిమా విషయంలో నా దేహంలోని రక్తాన్ని పీల్చుకొనేంత పనిచేశాడు. సినిమాను దెబ్బ తీయడానికి మాటల దాడి చేశాడు. వేధించాడు అని కంగన అన్నారు.

    మీడియాకు డబ్బులు వెదజల్లి

    మీడియాకు డబ్బులు వెదజల్లి

    మణికర్ణిక సినిమాపై ఓ వైపు సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తుంటే.. క్రిష్ సిగ్గులేకుండా చాలా నీచంగా మాట్లాడారు. మీడియాకు డబ్బులు వెదజల్లి వీరనారి ఝాన్సీ బయోపిక్‌ను దెబ్బ తీయడానికి ప్రయత్నించాడు. వారి ప్రవర్తనతో విసిగిపోయాను. కానీ కొందరు ఫూల్స్‌ను ఎదురుకోవడానికి సమరవీరులు నాకు శక్తిని ఇచ్చారు అని కంగన మండిపడింది.

    నష్టాల్లో ఎన్టీఆర్: బయోపిక్ డిస్టిబ్యూటర్లు

    నష్టాల్లో ఎన్టీఆర్: బయోపిక్ డిస్టిబ్యూటర్లు

    ఎన్టీఆర్ బయోపిక్ విషయానికి వస్తే, తొలిభాగం ఎన్టీఆర్: కథానాయకుడు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. డిస్టిబ్యూటర్లకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. దాంతో ఎన్టీఆర్: మహానాయకుడు చిత్రం ద్వారా ఆదుకోవాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే తొలిభాగం కంటే పార్ట్2 దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్టు ట్రేడ్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

     దారుణంగా మహానాయకుడు వసూళ్లు

    దారుణంగా మహానాయకుడు వసూళ్లు

    ఫిబ్రవరి 22న రిలీజైన ఎన్టీఆర్ బయోపిక్ సుమారు రూ.45 కోట్లతో రూపొందింది. రెండు పార్టులు కలిపితే కూడా ఆ మొత్తాన్ని రాబట్టలేకపోయిందనే మాటను ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గత మూడు రోజుల్లో మహానాయకుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్లు మాత్రమే రాబట్టడం సినిమా పరిస్థితికి అద్ధం పట్టింది.

    English summary
    NTR: Mahanayakudu too made a poor collection at the box office and it looks like it is heading to become a bigger disaster than NTR: Kathanayakudu. Kangana Said, My heart goes out to Balakrishna sir who trusted Krish and put so much at stake, but for me now is the time to question every vulture who was out for my blood, who attacked and harassed me for taking charge of a troubled situation and making a critically acclaimed and commercially successful film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X