మరోసారి...హాట్ అండ్ సెక్సీ లుక్‌తో కంగనా (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఏక్ నిరంజన్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కంగనా రనౌత్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో మళ్లీ తెలుగు సినిమాల వైపు చూడలేదు కంగనా. బాలీవుడ్ పరిశ్రమలోనే తన టాలెంట్ ప్రదర్శిస్తూ దూసుకెలుతోంది.

తాజాగా కంగనా రనౌత్ 'జిక్యూ' అనే మేగజైన్ కవర్ పేజీ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. అక్టోబర్ నెల ఎడిషన్ కోసం ఆమె ఈ ఫోజులు ఇచ్చింది. సరికొత్త లుక్ ఔట్ ఫిట్స్ ధరించి హొయలు ఒలికిస్తూ అభిమానులు ఆకట్టుకుంటోంది. సెక్సీ అప్పియరెన్స్‌లో తనకు మరెవరూ సాటి రారు అనే విధంగా అందాలు ఆరబోసింది.

బాలీవుడ్ పరిశ్రమలో అందాల ఆరబోత విషయంలో తీవ్రమైన పోటీ నెలకొన్ని నేపథ్యంలో ఆ పోటీని తట్టుకుని...తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కంగనా ఈ రేంజిలో రెచ్చిపోయిందని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ మధ్య వరుస లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బాలీవుడ్లో దూసుకెలుతున్న కంగనా...పరిశ్రమలో బలంగా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది.

స్లైడ్ షోలో ఫోటోలు, కంగనా రనౌత్‌కు సంబంధించిన వివరాలు...

కంగనా రనౌత్

కంగనా రనౌత్

హిమాచల్ ప్రదేశ్‌లోని భంబ్లా అనే పట్టణంలో జన్మించిన కంగనా రనౌత్ మెడిసిన్ చేద్దామని అనుకుంది. అయితే ఆ తర్వాత మోడలింగ్ వైపు ఆకర్షితురాలైంది.

సినిమాల్లోకి...

సినిమాల్లోకి...

మోడలింగ్ రంగం నుండి బాలీవుడ్ వైపు సాగిన కంగనా రనౌత్ ‘గ్యాంగ్ స్టర్' అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాతోనే అవార్డు

తొలి సినిమాతోనే అవార్డు

తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డిబట్ అవార్డు గెలుచుకుంది కంగనా. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది.

గుర్తింపు తెచ్చిన సినిమాలు

గుర్తింపు తెచ్చిన సినిమాలు

బాలీవుడ్లో వచ్చిన ‘గ్యాంగ్‌స్టర్', ‘ఫ్యాషన్', ‘తను వెడ్స్ మను', ‘క్వీన్' చిత్రాలలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కంగనా రనౌత్. ఆమె ‘క్వీన్' చిత్రం పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి.

బజార్ మేగజైన్ కోసం..

బజార్ మేగజైన్ కోసం..

బజార్ బ్రైడ్ మేగజైన్ అక్టోబర్ సంచిక కవర్ పేజీ కోసం కూడా కంగనా ఫోటో షూట్లో పాల్గొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X