సమంత ఫిదా అయిపోయిందిగా.. నా ఫేవరేట్ హీరో అంటూ..!

Recommended Video

Samantha Talks About Manikarnika Movie | Filmibeat Telugu

అక్కినేని సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంటోంది. సమంత కెరీర్ ఆరంభం నుంచి గమనిస్తే ఆమె గ్లామర్ పాత్రలు చేస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపై కూడా దృష్టిపెడుతూ వచ్చింది. సమంత నటించిన అత్యధిక చిత్రాలు ఘనవిజయాలు సాధించడంతో సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా సమంత మరో హీరోయిన్ ని ప్రశంసలతో ముంచెత్తింది. మణికర్ణిక చిత్రం మంచి టాక్ తో దుసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇంతకీ సమంత మణికర్ణిక చిత్రం గురించి, కంగనా రనౌత్ గురించి ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం!

హృదయాలు గెలుచుకున్న రాణి

హృదయాలు గెలుచుకున్న రాణి

సమంత తాజాగా మణికర్ణిక చిత్రాన్ని చూసింది. కంగనా రనౌత్ ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. కంగనా నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. సమంత మణికర్ణిక చిత్రం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మణికర్ణిక ఝాన్సీకి రాణి. కంగనా రనౌత్ మన హృదయాలు గెలుచుకున్న రాణి అంటూ సమంత పోస్ట్ చేసింది. కంగన రనౌత్ నా ఫేవరెట్ హీరో అంటూ ప్రత్యేకంగా కామెంట్ చేసింది.

క్రిష్, కంగనా రనౌత్ ఇద్దరూ

క్రిష్, కంగనా రనౌత్ ఇద్దరూ

మణికర్ణిక చిత్రానికి క్రిష్, కంగనా రనౌత్ ఇద్దరూ దర్శత్వం వహించారు. చాలా భాగం షూటింగ్ ముగిసిన తర్వాత కథ విషయంలో క్రిష్, కంగనా మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో క్రిష్ షూటింగ్ చివర్లో మణికర్ణిక చిత్రం నుంచి తప్పుకున్నాడు. మిగిలిన భాగానికి కంగన రనౌత్ దర్శకత్వం వహించింది.ఝాన్సీ లక్ష్మిబాయి పాత్రలో కంగనా రనౌత్ పవర్ ఫుల్ నటన కనబరిచినట్లు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద జోరు

బాక్సాఫీస్ వద్ద జోరు

మణికర్ణిక చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటుతోంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లో 47 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. మణికర్ణిక చిత్ర వసూళ్లు సోమవారం కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కంగనా రనౌత్ కు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. దీనితో కంగనా సోలో హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేయాలని భావిస్తోంది.

విజయేంద్ర ప్రసాద్

విజయేంద్ర ప్రసాద్

ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రంలో సోనూసూద్ పోషించిన పాత్ర విషయంలో కంగనా, క్రిష్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. మణికర్ణిక చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సమంత కంగనా రనౌత్ నా ఫెవరెట్ హీరో అని కామెంట్ చేయగా.. అంతకు ముందే రాంగోపాల్ వర్మ మణికర్ణిక చిత్రం గురించి మాట్లాడుతూ స్టార్ హీరోలంతా కంగనా రనౌత్ ముందు హీరోయిన్లుగా మారిపోయారని కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X