'మణికర్ణిక' ట్విట్టర్ రివ్యూ: ఝాన్సీ లక్ష్మీభాయిగా కంగనా.. జూలు విదిల్చిందా!

కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ చేసింది. ఆ తర్వాత కంగనా అనేక వివాదాల్లో చిక్కుకుంది. అవకావం వచ్చిన ప్రతి సారి నటిగా కంగానా రనౌత్ అద్భుతంగా నటిస్తూ వచ్చింది. దీనితో కంగనా రనౌత్ క్రేజ్ కూడా పెరిగింది. ప్రస్తుతం కంగనా విభిన్న చిత్రాలకు, హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమ్స్ కి ప్రాధాన్యత ఇస్తోంది. కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం మణికర్ణిక. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శత్వం వహించారు. మధ్యలో విభేదాలు తలెత్తడంతో అతడు ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కంగనా రనౌతే దర్శకత్వ భాద్యతలు నిర్వహించింది.

పవర్ ఫుల్ మూవీ

ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ మణికర్ణిక చిత్రంపై స్పందించారు. మణికర్ణిక గురించి ఒక్కమాటలో రివ్యూ.. ఇది పవర్ ఫుల్ మూవీ. అందరిలో ఉత్తేజాన్ని నింపే ఆదర్శవంతమైన చిత్రం. కంగనా రనౌత్ అద్భుతంగా నటించింది. క్లైమాక్స్ చాలా బావుంది. దేశభక్తిని, ఝాన్సీ లక్ష్మీబాయి శక్తిని అద్భుతంగా చూపించారు.

మాస్టర్ పీస్

మణికర్ణిక చిత్రం ఒక మాస్టర్ పీస్. భారత దేశ చరిత్రలో అత్యంత ధైర్యవంతమైన మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా అద్భుతంగా నటించింది. ఝాన్సీ లక్ష్మీబాయి నిజంగా వెండితెరపైకి వచ్చిందా అన్నట్లుగా కంగన నటన ఉంది. ప్రతి భారతీయుడు ఈ చిత్రాన్ని చూడాలి.

మణికర్ణిక బాగాలేదు

మణికర్ణిక చిత్రం బాగాలేదు. ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయి భర్త పాత్రని వక్రీకరించారు. కొన్ని అనవసరమైన డైలాగులు ఉపయోగించారు.

మైండ్ బ్లోయింగ్

మణికర్ణిక చిత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా మంచి చిత్రాన్ని తీసుకుని వచ్చారు. అద్భుతమైన దేశభక్తితో కూడుకున్నది మణికర్ణిక చిత్రం.

సినిమాటోగ్రఫీ అదిరింది

మణికర్ణిక చిత్రకథ చాలా బావుంది. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు. బ్యాగ్రౌండ్ సంగీతం బావుంది. విజువల్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో నటులంతా పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. కంగనా రనౌత్ మరోమారు తన నటనతో మెప్పించింది. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం ఇది.

ఫస్టాఫ్ అదిరిపోయింది

మణికర్ణిక గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాబులస్ మూవీ. కథ, స్క్రీన్ ప్లే, కంగనా రనౌత్ పాత్ర అన్ని చాలా బాగా కుదిరాయి. ఫస్ట్ హాఫ్ అదరగొట్టేశారు. సెకండ్ హాఫ్ కూడా బావుంది.

ఏడాది నుంచి

కంగనా రనౌత్ చిత్రం కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా. ఎదురుచూపులు తగ్గ ఫలితం దక్కింది. ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రని పోషించగల కొద్దిమంది నటీమణులలో కంగనా ఒకరు. మణికర్ణిక చిత్ర కథ చెప్పిన విధానం చాలా బావుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X