Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వాడు నా ఛాతి భాగాన్ని టచ్ చేశాడు.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కంగన
Recommended Video
వివాదాస్పద వ్యాఖ్యల్లో ఎప్పుడూ ముందుంటూ సంచలనాలకు కేంద్రబిందువుగా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. అది సినిమాల పరంగా గానీ, వ్యక్తిగత విషయాల పరంగా గానీ ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయడం ఈమె నైజం. ఆమె చెప్పిన మాటలకు ఒకవేళ వివాదాలు చుట్టుముట్టినా సరే బే షరతుగా, వీరోచితంగా సమాధానం చెబుతుంటుంది కంగనా. సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగన ఈ సారి తన పర్సనల్ విషయం ఒకటి చెప్పి ఆవేదన చెందింది.
'మీటూ' ఉద్యమ ప్రభావంతో
బాలీవుడ్లో ప్రారంభమైన 'మీటూ' ఉద్యమ ప్రభావంతో హీరోయిన్లంతా ఓపెన్ గా తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్స్ తాము ఎదుర్కొన్న సెక్సువల్ హరాస్మెంట్ విషయాలను బాహాటంగా చెప్పేయగా, తాజాగా సంచలన తార కంగనా రనౌత్ తాను కూడా ఈ భాదితురాలినే అని పేర్కొంటూ తన తన చిన్నతనంలో ఎదురైన ఓ సంఘటన గురించి వివరించడం హాట్ టాపిక్‌గా మారింది.
దీపిక పదుకొనె, పరిణీతి చోప్రాతో సహా
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ చలనచిత్రాలు సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొనె, పరిణీతి చోప్రా, కంగనా రనౌత్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా తనపై చిన్నతనంలో జరిగిన ఈవ్ టీజింగ్ గురించి తెలిపి ఆవేదన చెందింది కంగన.
కంటతడి పెట్టుకుంటూ జరిగిన విషయం
కార్యక్రమంలో భాగంగా తన పాఠశాల రోజులను గుర్తుతెచ్చుకొని కంటతడి పెట్టుకుంది కంగన రనౌత్. తాను చండీఘర్ పాఠశాలలో చదువుతున్నప్పుడు అక్కడి అబ్బాయిలు బైక్ లపై స్పీడ్‌గా వెళుతూ అమ్మాయిలను ఎక్కడెక్కడో తాకడానికి ప్రయత్నించేవారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఓ రోజు తాను స్కూల్‌కు వెళ్తుండగా వెనుక నుంచి బైక్ పై వేగంగా వచ్చిన ఓ వెదవ తన ఛాతి భాగంలో గట్టిగా గుద్ది వెళ్లాడని చెబుతూ బాధపడింది కంగన.
ఈ ఘటనను దీన్ని ఎవరైనా చూశారా? అనుకొని
ఈ ఘటన జరగగానే షాక్ అయ్యానని, అలాగే తాను ఎదుర్కొన్న ఈ దుర్ఘటనను ఎవరైనా చూశారేమోనని బాగా కంగారు పడ్డానని కంగన తెలిపింది. కాగా ఇదే కార్యక్రమంలో కంగనతో పాటు పాల్గొన్న పరిణితి చోప్రా దీనిపై రియాక్ట్ అవుతూ..''ఇలాంటి సందర్భంలో జనాలు అమ్మాయే తప్పు చేసినట్టుగా ఆలోచిస్తారు తప్ప జరిగింది ఎవ్వరూ పట్టించుకోరు'' అని చెప్పింది.
కంగనా సినిమాలు
ఇటీవలే మాణికర్ణిక సినిమాతో సంచలన విజయం తన ఖాతాలో వేసుకున్న కంగన.. ప్రస్తుతం 'మెంటల్ హై క్యా' చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా కంగన లీడ్ రోల్ పోషిస్తోంది.