బాలీవుడ్‌లో అదే జరిగితే.. టాప్ హీరోలు, హీరోయిన్లు జైలుకే.. కంగన ట్వీట్ వైరల్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు తర్వాత బాలీవుడ్‌ను డ్రగ్స్ వివాదం భారీగా కుదిపేస్తున్నది. సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి డగ్స్ డీలర్స్‌తో సంబంధాలు వెలుగుచూడటం హిందీ చిత్రపరిశ్రమను మరోసారి సందిగ్ధంలో పడేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దిగ్గజ హీరోలు, హీరోయిన్లఫై ఫైర్ బ్రాండ్ యాక్టర్ కంగన రనౌత్ మరోసారి విరుచుకుపడ్డారు. కంగన ఫైర్‌కు కారణాలు ఇవే..

సుశాంత్ మరణం తర్వాత కంగన ఆరోపణలు

సుశాంత్ మరణం తర్వాత కంగన ఆరోపణలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తర్వాత బాలీవుడ్ మాఫియాపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న వారిలో కంగన రనౌత్ ఒకరు. బాలీవుడ్‌లో ముఠా రాజకీయాలు, బయటి నుంచి వచ్చే హీరోలను అణగదొక్కుతున్నారని, బంధుప్రీతి లాంటి విషయాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

వారిని ఎందుకు ప్రశ్నించరంటూ..

వారిని ఎందుకు ప్రశ్నించరంటూ..

బాలీవుడ్‌లో కొందరు ప్రముఖులు మాఫియాగా మారి పలువురిని టార్గెట్ చేస్తున్నారు. సుశాంత్ మరణానికి మహేష్ భట్, ఆదిత్య చోప్రా, కరణ్ జోహర్ లాంటి వారు అంటూ ఆమె విరుచుకుపడ్డారు. సుశాంత్ కేసులో వారిని విచారించాలని మొదటి నుంచి ఆమె డిమాండ్ చేస్తున్నారు. అలాగే రియా చక్రవర్తిది కూడా కీలక పాత్రే అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత మహేష్ భట్‌ను ముంబై పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ ప్రముఖుల బండారం అలా

బాలీవుడ్ ప్రముఖుల బండారం అలా

కంగన రనౌత్, ఇతర ప్రముఖుల ఆరోపణల నేపథ్యంలో రియా చక్రవర్తిపై డ్రగ్స్ వాడకం, డీలర్ల సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులపై కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ అగ్ర నటులు, హీరోలను విచారిస్తే బండారమంతా బయటపడుతుంది అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

టాప్ హీరోలు, హీరోలు జైల్లోనే

టాప్ హీరోలు, హీరోలు జైల్లోనే

రియాకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాల నేపథ్యంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో కంగన ట్వీట్ చేస్తూ.. బాలీవుడ్‌లోకి ఎన్సీబీ ప్రవేశిస్తే.. చాలా మంది టాప్ హీరోలు, హీరోయిన్లు జైలు ఊచలు లెక్కించాల్సిందే. వారి రక్త నమూనాలు పరిక్షిస్తే సంచలన విషయాలు బయటకు వస్తాయి. బాలీవుడ్ మురికి కంపును ప్రధాని స్వచ్ఛభారత్ తుడిచిపెట్టాలని ఆశిస్తున్నాను అంటూ కంగన రనౌత్ ట్వీట్ చేశారు.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
రంగంలోకి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో

రంగంలోకి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో

ఇదిలా ఉండగా, రియా చక్రవర్తికి డ్రగ్స్ డీలర్స్ ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేపట్టనున్నట్టు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్పష్టం చేసింది. ఎన్సీబీ చీఫ్ డీజీ రాకేష్ అస్థానా మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ కేసులో డ్రగ్ మాఫియా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తాం అని అన్నారు. త్వరలోనే పలువురుకి సమన్లు జారీ చేసి విచారిస్తామని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X