twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kangana Ranaut: రాజమౌళి కెరీర్ పై కాంట్రవర్సీ బ్యూటీ కామెంట్స్.. ఆయనకు పెద్ద ఫ్యాన్ అంటూ

    |

    దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా RRR ఇటీవల భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక విడుదలకు ముందే ఈ సినిమా భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసి ఒక స్పెషల్ బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇక విడుదల తరువాత కూడా అదే తరహాలో అంచనాలు అందుకుంటుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి.

    ఇక రాజమౌళి సృష్టించిన ఈ యాక్షన్ విజువల్ వండర్ థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత కూడా చాలా ఈజీగా అంచనాలను అందుకోవటంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డుల ను చూసి పలువురు సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చాలా తక్కువ మంది స్పందిస్తున్నారు. రీసెంట్ గా కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

    అసూయతోనే..

    అసూయతోనే..

    జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటించిన RRR సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇక సినిమా రిలీజ్ తర్వాత సినిమాను చూసిన కొంతమంది సినీ స్టార్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది బాలీవుడ్ స్టార్స్ మాత్రం అసూయతోనే RRR గురించి మాట్లాడడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

    కంగనా రనౌత్ రియాక్షన్

    కంగనా రనౌత్ రియాక్షన్

    ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 600 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న RRR సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా గా చరిత్రను సృష్టించింది. దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాల రికార్డులపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ కాంట్రవర్సి బ్యూటీ కంగనా రనౌత్ కూడా దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్ పై ప్రశంసలు కురిపించింది.

    అపజయాలు లేవు..

    అపజయాలు లేవు..

    ఎప్పటికైనా సరే భారతీయ చలన చిత్రాలలో రాజమౌళి సార్ గ్రేట్ అంటూ ఆయన ఒక గొప్ప దర్శకుడు అని మరోసారి నిరూపించుకున్నాడని తన ఇన్స్టాగ్రామ్ లో కాంగనా వివరణ ఇచ్చింది. ఇంతవరకూ ఆయన సినిమా కెరీర్ లోనే అపజయాలు లేవు అని అలాగే భవిష్యత్తులో కూడా ఉండవు అని కూడా ఆమె తెలియజేసింది.

    నిజాయితీగా..

    నిజాయితీగా..

    ఇక దర్శక ధీరుడు రాజమౌళి గారు కేవలం ఒక విజయవంతమైన దర్శకుడు మాత్రమే కాదు అని దేశంపై అలాగే ధర్మంపై ఆయన చూపించే ప్రేమ గొప్పది అని అన్నారు. ఇక మంచి మానవత్వం గుణాలు ఉన్న ఒక గొప్ప మనిషి అని కూడా కంగనా వివరణ ఇచ్చారు. మీలాంటి రోల్ మోడల్ ఉండడం అదృష్టం అని నిజాయితీగా మీకు పెద్ద అభిమానిని అని కంగనారనౌత్ వివరణ ఇచ్చింది.

    Recommended Video

    RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
     మీరు ఎప్పుడు వెళుతున్నారు?

    మీరు ఎప్పుడు వెళుతున్నారు?

    అంతే కాకుండా మరొక పోస్టులు అయితే కంగనారనౌత్ రేపు తన కుటుంబ సభ్యులతో కలిసి RRR సినిమాకు వెళుతున్నాను అని చెబుతూ.. మీరు ఎప్పుడు వెళుతున్నారు అని కూడా ఆమె నెటిజన్లను ప్రశ్నించింది.

    ఇక వరుసగా కాంట్రవర్సీ కామెంట్స్ తో బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న కంగనారనౌత్ చాలా రోజుల తరువాత సౌత్ సినిమాపై పాజిటివ్ గా స్పందించడంతో అందుకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి.

    English summary
    Kangana Ranaut special comments on RRR movie succes and ss rajamouli career..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X