సిగ్గుండాలి.. ఎంత ధైర్యం.. రాజమౌళిపై కాంట్రవర్సీ వార్తలపై కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్
దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా తీసినా కూడా అందులో హీరోలను తనదైన శైలిలో చాలా పాజిటివ్ గా చూపిస్తూ ఉంటారు. ఇక RRR సినిమాలో కూడా దేశం కోసం పోరాడే యోధులుగా ఇద్దరు అగ్ర హీరోలను చూపించిన విధానం కూడా చాలామందిని ఆకట్టుకుంది. అయితే ఇటీవల ఒక విదేశీ మీడియా రాజమౌళిపై కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే విధంగా ఒక కథనాన్ని ప్రచారం చేయడం హాట్ పిక్ గా మారింది. ఇక ఈ విషయంపై కంగనా కూడా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

వివాదాస్పద కథనాలు
రాజమౌళి పేరు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా వైరల్ గా మారిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్లినా కూడా జనాలు మాత్రమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ తరుణంలో రాజమౌళి భారతదేశానికి చెందిన వివాదాస్పద గోల్డెన్ బ్లాక్ బస్టర్ అంటూ ఒక నెగిటివ్ ఆర్టికల్ ప్రచారం చేశారు. రాజమౌళి మతంపై ఇచ్చిన ఒక వివరణను కావాలని నెగిటివ్ గా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా ప్రచారాలు చేస్తున్నట్లు కామెంట్స్ వస్తున్నాయు.

కంగనా సీరియస్
ఆయనపై వివిధ రకాల కోణాల్లో వార్తలు రావడంతో ఆ విషయంపై తెలుగు ప్రముఖులు కూడా సీరియస్ అవుతున్నారు. అలాగే ప్రముఖ హీరోయిన్ కంగనా రౌనత్ కూడా ఆ ఇంగ్లీష్ కథనంపై సీరియస్ అవుతూ సోషల్ మీడియాలో తన వివరణ ఇచ్చారు. ఆయనను వివాదాస్పదమైన దర్శకుడు అంటూ ఎందుకు ముద్ర వేస్తున్నారో అర్థం కావడం లేదు. అసలు అయినపై ఇలాంటి వివాదాన్ని ఎలా తీసుకు వస్తారు? బాహుబలి అనే సినిమాతో మరుగున పడిపోయిన నాగరికతను వెలుగులోకి తెచ్చినందుకా? ఆయనను పై అలాంటి నిందలు వేస్తున్నది.. అని ఆమె ప్రశ్నించారు.

కాంట్రవర్సీ డైరెక్టర్ అనే ముద్ర
అంతేకాకుండా దేశభక్తితో RRR సినిమాను తెరకెక్కించిన విధానం ఎంతగానో అందరిని ఆకట్టుకుంది. అలాంటి సినిమా తీసినందుకు అలాగే అంతర్జాతీయ ఎర్ర తివాచీ పై దోతితో నడిచినందుకు ఆయనపై వివాదాస్పదంగా కామెంట్స్ చేస్తున్నారా? అంటూ ఆమె మండిపడ్డారు. రాజమౌళిపై కాంట్రవర్సీ డైరెక్టర్ అనే ముద్ర వేస్తున్నారు అనేది కరెక్ట్ కాదని ఆమె కౌంటర్ ఇచ్చారు.

ఎంత ధైర్యం అంటూ..
అసలు ఆయన చేసిన వివాదం దేశాన్ని ఇష్టంగా ప్రేమించడమా? స్థానిక సినిమాను ప్రపంచ స్థాయిలో పరిచయం చేయడమా? అలాగే ఆయన ఆధ్యాత్మికత దేశభక్తి అవే ఆయన తప్పులా? అంటూ కంగనా తన ట్వీట్స్ లో సీరియస్ గా స్పందించింది. అంతేకాకుండా ఆమె ఎంత ధైర్యం? ఒక గొప్ప భారతీయ దర్శకుడు గురించి అలా మాట్లాడడం.. అంటూ ఆమె ప్రశ్నించింది.

నేను ఎంత మాత్రం ఊరుకోను
ఒక విధంగా అలా కామెంట్ చేసే వారికి సిగ్గుండాలి. రాజమౌళిని ఏమైనా అంటే నేను ఎంత మాత్రం ఊరుకోను ఆ ధైర్యం చేయకండి ఆయన వర్షంలో ఒక మెరుపులాంటివారు. యోగి లాంటివారు. ఆయన మన దేశంలో పుట్టడమే మనకు గొప్ప గర్వకారణం. అదృష్టం.. అంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ ట్వీట్స్ పై రాజమౌళి నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











