హార్మోన్ల ఎఫెక్ట్ తోనే బెస్ట్ కొలతలు మారాయి...పూరీ హీరోయిన్ వివరణ
కేవలం నా బ్రెస్ట్ మాత్రమే కాదు నా శరీరం అంతా ఆశ్చర్యకరంగా పెరిగింది. నేను ఏడు కేజీల బరువు పెరిగాను. నేను దానిని తగ్గించుకోవాలని చూస్తున్నారు. అయినా హార్మోన్ల ప్రభావం వల్ల అందరిలో వచ్చే మార్పులే నాలోనూ వచ్చి ఉండవచ్చు. అంతేగానీ నేనేదో ఆపరేషన్ లు చేయించుకొని కొలతలు మార్చుకొన్నాను అనడం పద్దతిగా లేదు. అయినా అలాంటి రూమర్స్ ఎవరు..ఎందుకు..సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయింది పూరీ హీరోయిన్ కంగనా రౌనత్. ఏక్ నిరంజన్ చిత్రంలో ప్రభాస్ సరసన చేసిన ఆమెను రీసెంట్ గా శస్త్ర చికిత్సలు చేయించుకుని కొలతలు సరిచేసుకుందని బాలీవుడ్ మీడియాలో వార్తుల వస్తున్నాయి. దాన్ని ఖండిస్తూ ఆమె మాట్లాడుతూ పై విధంగా స్పందించింది. అలాగే...ఒక స్త్రీ అందంగా ఉండాలంటే నిర్దిష్టంగా ఫలానా కొలతలే ఉండాలని ఎక్కడా నియమం లేదు. ఒక్కొక్కరిలో ఒక్కో భాగం అందంగా ఉంటుంది. చూసే చూపులో తేడా ఉండటం వల్లే అలా కనిపిస్తారు. పదిహేడేళ్ల వయసులో నేను పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఇప్పుడు నా వయసు 23 ఏళ్లు..ఆ మార్పు సహజం..దానికి తగ్గట్లుగానే శరీరంలో కొన్ని అందాలు వచ్చి ఉంటాయి అంటోంది.కరెక్టేనేమో.


Click it and Unblock the Notifications











