మంచి, చెడు చూస్తే చేయలేమంటన్న ప్రభాస్ హీరోయిన్
'అవకాశం రావడం గొప్ప. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాల్లో మంచివి, చెడ్డవి అని ఆలోచిస్తూ కూర్చుంటే ఒరిగే ఫలితం శూన్యం. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత గానీ..ఏది మంచిదో ఏది చెడ్డదో ప్రేక్షకులు నిర్ణయించలేరు. అలాంటిది కేవలం కథను ఎక్కడో విన్నట్టుందన్న నెపంతో ప్రాజెక్ట్‌ను వదులుకోను 'అని అంటోంది కంగనా రనౌత్. తెలుగులో ప్రభాస్ సరసన 'ఏక్ నిరంజన్'లో నటించిందీ ముద్దుగుమ్మ. 'గ్యాంగ్ స్టర్' చిత్రంతో కెరీర్ ని ప్రారంభించిన ఈ భామ చేతిలో ప్రస్తుతం అరడజను హిందీ చిత్రాలున్నాయి. అలాగే "స్క్రిప్టును అంగీకరించే ముందు తప్పకుండా నమ్మకంతోనే అంగీకరించాలి. మంచి జరుగుతుందనుకుని ప్రారంభించే ప్రతి పనీ మనకు విజయాన్నే చేకూరుస్తుంది. సినిమాను ఒప్పుకునే ముందు ఇతరుల సలహాలను తీసుకునే వారిని చూస్తే నాకు నవ్వొస్తుంది" అని అంటోంది. ప్రస్తుతం ఆమె 'ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై', 'నాకౌట్', 'నో ప్రాబ్లమ్', 'గేమ్', 'తను వెడ్స్ మను'...చిత్రాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











