BJP పాలిటిక్స్‌లో కంగన రనౌత్.. బీజేపీ టికెట్‌పై లోక్‌సభకు ఎక్కడి నుంచి పోటీ అంటే?
బాలీవుడ్ నటి, నిర్మాత, దర్శకురాలు కంగన రనౌత్ ఎన్నికల బరిలోకి దూకింది. గత కొద్దికాలంగా బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న ఆమెకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తాజాగా కొన్ని దేశవ్యాప్తంగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సీట్లలో కంగన పేరు కనిపించింది. దాంతో సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. ఆమె ఏ సీటు నుంచి పోటీ చేసేందుకు కాషాయ పార్టీ అనుమతించిందనే వివరాల్లోకి వెళితే..
కొన్ని సంవత్సరాలుగా హిందుత్వ భావజాలానికి మద్దతు పలుకుతూ బీజేపీ అధిష్టానంతో చాలా సన్నిహితంగా ఉంటున్న కంగన రనౌత్ రాజకీయాల్లో చేరేందుకు సుముఖత చూపించింది. బీజేపీ సంబంధిత కార్యక్రమాల్లో చురుకు పాల్గొన్నారు. బీజేపేతర పార్టీలపై ఆమె అవసరం చిక్కినప్పుడల్లా ఘాటైన వాఖ్యలు చేసింది.

మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన ఐదో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీలో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థుల పేర్లతోపాటు ఇతర క్యాండిడేట్ల పేర్లు ప్రకటించింది. ఈ జాబితాలో కంగన రనౌత్‌కు టికెట్ కేటాయించినట్టు వెల్లడించింది.
బీజేపీ తరఫున ఆమెను హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టికెట్ ఖారారు చేసింది. తనకు మోడీ ప్రభుత్వం టికెట్ కేటాయించడంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేసి.. నేను అత్యంత ప్రేమించే నా సొంత పార్టీ భారతీయ జనతా పార్టీ. బిజేపీకి, ఆ పార్టీ అధినాయకత్వానికి బేషరతుగా సపోర్ట్ ఉంటుంది. నేను పుట్టిన ప్రదేశం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ లోక్‌సభ టికెట్ కేటాయించింది. పార్టీ హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటాను. ఇక నేను బీజేపీలో అధికారికంగా చేరుతాను. పార్టీకి విలువైన కార్యకర్తగా, ప్రజలకు నిజాయితీపరురాలైన సేవకురాలిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని కంగన రనౌత్ పోస్టులో వెల్లడించింది.


Click it and Unblock the Notifications











