కంగన రనౌత్‌ మెడకు ‘టెర్రిరిస్టు’ వ్యాఖ్యల వివాదం.. క్రిమినల్ కేసు నమోదు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఉద్దేశించి బాలీవుడ్ నటి కంగన రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మీడియాలో దుమారం సృష్టించాయి. ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కర్ణాటకలోని తుమ్కురు జేఎంఎఫ్‌సీ కోర్టులో కేసు నమోదైంది. రైతులను ఉద్దేశించి కంగన రనౌత్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే..

 కంగన చేసిన ట్వీట్ ఏమిటంటే..

కంగన చేసిన ట్వీట్ ఏమిటంటే..

ప్రధాని మోదీ సర్కార్ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందంటూ రైతులు రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. రైతుల చేస్తున్న ఆందోళనపై కంగన ట్వీట్ చేస్తూ. .కొందరు టెర్రిరిస్టులు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తున్నారు అని కామెంట్ చేశారు.

 ఆ టెర్రరిస్టులే రైతులుగా

ఆ టెర్రరిస్టులే రైతులుగా

గతంలో సీఏఏ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎవరైతే మత ఘర్షణలకు కారణమయ్యారో అందులోని కొందరు ఇప్పుడు రైతు ఉద్యమంలో చేరారు. ఆ టెర్రరిస్టులే ఇప్పుడు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కంగన మండిపడ్డారు. అందులో కొందరు రాజకీయ నేతలు కూడా ఉన్నారంటూ కామెంట్ చేశారు.

 కంగన రనౌత్ వివరణ ఇలా

కంగన రనౌత్ వివరణ ఇలా

అయితే రైతు ధర్నాలను, నిరసనలను ఉద్దేశించి చేసిన ట్వీట్ వివాదంగా మారడంతో తాను ఏమన్నాననే విషయాన్ని కంగన మరో ట్వీట్‌లో స్పష్టం చేశారు. రైతులను ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేయలేదు. సీఏఏ అల్లర్లకు కారణమైన కొందరే కుట్రకు పాల్పడుతున్నారనే విధంగా కామెంట్ చేశారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
 కర్ణాటకలో నమోదైన కేసు ఇదే..

కర్ణాటకలో నమోదైన కేసు ఇదే..

కంగన ట్వీట్ ద్వారా చేసిన వ్యాఖ్యలను ఆధారంగా కర్ణాటక తూమ్కూరు కోర్టులో కేసు నమోదు చేశారు. కంగనపై చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమెపై ఐపీసీ సెక్షన్ 44, 108, 153, 153A, 504 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ క్రిమినల్ కేసుపై కంగన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X