ఆ పోర్న్‌స్టార్‌కు ఎంపీ టికెట్ వచ్చినప్పుడు.. నాకు టికెట్ రావొద్దా? కంగన రనౌత్ వీడియో ట్రెండింగ్!

పార్లమెంట్ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నుంచి కంగన రనౌత్ ఎంపీగా పోటీ చేయడానికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలో ఆమె పేరును చేర్చడంతో ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే కాషాయ పార్టీకి సానుభూతిపరురాలిగా పలు వేదికలపై ఆమె సానుకూలంగా కామెంట్స్ చేయడం తెలిసిందే. అయితే కంగన మండి నుంచి పోటీ చేస్తున్నారనే విషయం బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా చైర్ పర్సన్ సుప్రియా శ్రీనాతే పెట్టిన పోస్టు వివాదాస్పదమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

కంగన రనౌత్ మండి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారనే విషయంపై సుప్రియ శ్రీనాతే స్పందిస్తూ.. మండిలో ఆమె రేటు ఎంత అంటూ పోస్టు పెట్టారు. రజ్జో అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించిన పోస్టర్‌ను షేర్ చేసింది. అయితే తనపై కామెంట్ చేసిన సుప్రియాపై ఘాటుగా స్పందిస్తూ.. నేను నా కెరీర్‌లో ఎన్నో పాత్రలు చేశాను. వాటిని ఆధారంగా చేసుకొని నాపై విషం చిమ్మడం సరికాదు అని అన్నారు. ఇలా మహిళల మనోభావాలను దెబ్బ తీయడం సరికాదు అని హితవు పలికారు.

Kangana Ranaut s Comments on Urmila Matondkar as Porn Star video Tredning

అయితే కంగన రనౌత్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టిన తర్వాత ఆమె గతంలో సినీ తారలను కించపరుస్తూ చేసిన వీడియోలను కాంగ్రెస్ వర్గాలు షేర్ చేస్తున్నాయి. గతంలో శ్రద్దాకపూర్‌ను ఉద్దేశించి నెపోటిజం అంటూ కామెంట్ చేస్తూ.. ఆమెపై వెకిలి చేష్టలు చేసిన వీడియో షేర్ చేశారు. అప్పుడు మహిళల మనోభావాలు గుర్తుకు రాలేదా? అని కంగన రనౌత్‌ను ప్రశ్నిస్తున్నారు.

Kangana Ranaut s Comments on Urmila Matondkar as Porn Star video Tredning

అలాగే గతంలో బాలీవుడ్ నటి ఊర్మిల మతోంద్కర్‌పై కంగన రనౌత్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ఊర్మిల ఓ సాఫ్ట్ ఫోర్న్‌స్టార్. ఆమె ఎలాంటి పాత్రల్లో నటించిందో మీకు తెలియదా? అలాంటి పోర్న్‌స్టార్‌కు టికెట్ లభించినప్పుడు.. నాకు టికెట్ ఎందుకు లభించకూడదు అని ప్రశ్నించింది. ఊర్మిల మాత్రమే కాకుండా అందరికీ టికెట్లు లభిస్తున్నప్పుడు.. నటిగా నేను ఎందుకు టికెట్ కోరుకోకూడదు అని ఘాటుగా స్పందించింది.

ఈ వీడియోను ఆధారంగా చేసుకొని.. మీరు ఓ నటిని పోర్న్‌స్టార్ అని కామెంట్ చేయవచ్చు. మీరు రజ్జో సినిమాలో వేశ్యగా నటిస్తే.. మిమ్మల్ని మేము కామెంట్ చేయకూడదా? మీ వరకు వస్తే మనోభావాలు? వేరే వారి విషయంలో మనోభావాలు మీకు గుర్తుకు రావా? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

Kangana Ranaut s Comments on Urmila Matondkar as Porn Star video Tredning

ఇదిలా ఉండగా, కంగన రనౌత్‌పై పోస్టు పెట్టిన సుప్రియా శ్రీనాతే తన తప్పును గ్రహించారు. ఆ తర్వాత తన పోస్టును డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వ్యవహారాన్ని జాతీయ మహిళా కమీషన్ సీరియస్‌గా పరిగణించింది. ప్రస్తుతం ఆమెను వివరణ కోరేందుకు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ పోస్టు వివాదం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X