Kangana Ranaut's Thalaivi trailer: నిండుసభలో జయ వస్త్రాపహరణం, నేతల కీచకపర్వం.. ఎమోషనల్‌గా ట్రైలర్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోని కొన్ని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాతలుగా విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి బాహుబలి ఫేమ్ కేవీ విజయేంద్ర ప్రసాద్ రచయితగా వ్యవహరించారు. జయలలిత పాత్రలో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్ కనిపించిన ఈ ట్రైలర్ ఎలా ఉందంటే...

జయలలిత జీవితంలో కీలక సంఘటనలు

జయలలిత జీవితంలో కీలక సంఘటనలు

జయలలిత సినిమా కెరీర్‌ నుంచి రాజకీయ జీవితంలో జరిగిన కీలక సంఘటనలను తెర మీద భావోద్వేగంగా రూపొందించినట్టు ట్రైలర్‌లో స్పష్టమైంది. జయలలిత, ఎంజీఆర్ రొమాంటిక్ లైఫ్, అలాగే రాజకీయ ప్రవేశం లాంటి వివాదాస్పదమైన అంశాలు ట్రైలర్‌లో ఆసక్తిని రేకెత్తించాయి.

అహంకారపూరిత రాజకీయాలపై పోరాటం

అహంకారపూరిత రాజకీయాలపై పోరాటం

రాజకీయ ప్రవేశం తర్వాత ఎదురైన సంఘటనలకు ధీటైన సమాధానం చెప్పిన జయలలిత పాత్రలో కంగన రనౌత్ ఆకట్టుకొన్నారు. రాజకీయాలు మగవాళ్ల ప్రపంచమనే అహంకారపూరితంగా మాట్లాడిన నేతలకు జయలలిత ఎలా బుద్ది చెప్పారు. తలబిరుసు నేతలపై తలైవి పోరాటం ఎలా సాగిందనే విషయాలను ట్రైలర్‌లో కీలకంగా అంశంగా జొప్పించారు.

తలైవి నోట మాటల తూటాలు

తలైవి నోట మాటల తూటాలు

తలైవి ట్రైలర్‌లో డైలాగ్స్ మాటల తూటాలుగా పేలాయి. 'మగవాళ్ల ప్రపంచం. మగవాళ్లే పాలించాలి. ఒక ఆడదాని చేతిలో పార్టీని పెట్టి వెనక్కి నెట్టారు', 'మినప గారెలు ఎలా వేయాలో నెమ్మదిగా నేర్పిస్తున్నారు ఆయన', 'నిన్ను గెలువాలనుకొంటున్నవారికి నీవు పెద్ద మనిషి కావు.. నిన్న కురిసిన వానకు మెలిచిన గడ్డి మొక్కవు.. మర్రిచెట్టును ఢీకొట్టాలనుకోకు', ఎవరు మొక్కొ, 'ఎవరు చెట్టో కాలమే చెబుతుంది', మేడమ్ ప్రైమ్ మినిస్టర్.. ఇఫ్ యూ గివ్ ఏ ఔన్స్ టూ తమిళనాడు.. ఇట్ వీల్ గివ్ బ్యాక్ ఏ పౌండ్ లాంటి డైలాగ్స్ ట్రైలర్‌లో భావోద్వేగంగా మారాయి.

అసెంబ్లీలో వస్త్రపహరణం సీన్


ట్రైలర్‌లో ఎంజీఆర్‌తో రొమాంటిక్ సన్నివేశాలు, అలాగే పార్లమెంట్‌లో ప్రధాని ఇందిరాగాంధీతో ముఖాముఖిగా మారిన సీన్లు, అలాగే తమిళనాడు అసెంబ్లీ నిండు సభలో జయలలిత వస్త్రపహరణం లాంటి సీన్లు మరోసారి తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగవేసినట్టు స్పష్టమైంది.

Recommended Video

Star Heros Special Target On Dussehra Holidays
తెర ముందు ఎవరు? తెర వెనుక..

తెర ముందు ఎవరు? తెర వెనుక..


నటీనటులు: కంగన రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని, మధుబాల, జిషుసేన్ గుప్తా, పూర్ణ తదితరులు
దర్శకత్వం: ఏఎల్ విజయ్
నిర్మాతలు: విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్
సహ నిర్మాతలు: తిరుమల్ రెడ్డి, హితేష్ థక్కర్
రచన: కేవీ విజయేంద్ర ప్రసాద్
సంగీతం: జీవి ప్రకాశ్, రచిత అరోరా
సినిమాటోగ్రఫి: విశాల్ విట్టల్
ఎడిటింగ్: ఆంథోని, బల్లు సలూజా
రిలీజ్ డేట్: 2021-04-23

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X