twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రైతుల ముసుగులో ఆ టెర్రరిస్టులు.. వారే రక్తపాతం సృష్టించేలా.. కంగన ట్వీట్ దుమారం

    |

    బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ మరో వివాదంలో కూరుకుపోయారు. రైతులపై అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఇబ్బందిలో పడే పరిస్థితి కనిపిస్తున్నది. రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకొనే అవకాశం కల్పిస్తున్న వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానాతోపాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో అన్నదాతలను టెర్రరిస్టులనే విధంగా ట్వీట్ చేయడం ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగేలా ఉంది. ఈ వివాదం, కంగన ట్వీట్ వెనుక అసలు విషయం ఏమిటంటే..

    వివాదాస్పదమైన కంగన ట్వీట్

    వివాదాస్పదమైన కంగన ట్వీట్

    పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లుల ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తమైంది. సంకీర్ణ భాగస్వామి శిరోమణి అకాలీదళ్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో ప్రధాని చేసిన ట్వీట్‌ను సమర్ధిస్తూ కంగన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది.

    ప్రధాని మోదీ ట్వీట్‌‌కు మద్దతుగా కంగన

    ప్రధాని మోదీ ట్వీట్‌‌కు మద్దతుగా కంగన

    పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లుల ప్రవేశపెట్టిన నేపథ్యంలో మోడీ ట్వీట్ చేస్తూ.. ఎంఎస్పీ విధానం ఎప్పటిలానే కొనసాగుతుంది. రైతుల నుంచి ప్రభుత్వం ధాన్య సేకరణ యదావిధిగా చేపడుతుంది. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తున్నది. రాబోయే భావితారల రైతు కుటుంబాలకు వీలైనంత మేరకు మేలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. ఈ ట్వీట్‌ను సమర్ధిస్తూ కంగన ట్వీట్ చేయడం వివాదంగా మారింది.

    ఆ టెర్రరిస్టులే మరోసారి రక్తపాతం సృష్టించేందుకు

    ఆ టెర్రరిస్టులే మరోసారి రక్తపాతం సృష్టించేందుకు

    ప్రధాని మోదీ ట్వీట్‌కు మద్దతుగా కంగన రనౌత్ ట్వీట్ చేస్తూ.. వ్యవసాయ బిల్లుల విషయంలో అసలు విషయం తెలియక నిద్ర పోతున్న వారికి ప్రధాని ట్వీట్ నిద్ర లేపేలా చేస్తుంది. ఈ బిల్లులపై తప్పుడు భావనతో ఉన్న వారికి కూడా కనువిప్పు కలిగిస్తుంది. ఇక దొంగ నిద్ర నటించే వారికి ఎలాంటి ప్రభావం చూపదు. సీఏఏ బిల్లుతో పౌరసత్వం పోతుందని రక్తపాతం సృష్టించేందుకు ప్రయత్నించిన టెర్రరిస్టులే రైతులుగా చెలామణి అవుతూ ఈ బిల్లుల వెనుక కుట్ర పన్నుతున్నారనే విధంగా కంగన ట్వీట్ చేశారు.

    వారే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు

    వారే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు

    రైతులను నేను టెర్రరిస్టులని అనలేదు. సీఏఏ మీద తప్పుడు ప్రచారం, రూమర్లు క్రియేట్ చేసి మత ఘర్షణలకు కారణమయ్యారు. వారే ఇప్పుడు రైతులను తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్నారు. దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని నా ట్వీట్ అర్ధం. నేను ఏమన్నానో మీకు స్పష్టంగా అర్ధం అయి ఉంటుంది అని కంగన ట్వీట్ మరో ట్వీట్ చేశారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    కంగన ట్వీట్‌పై భిన్నాభిప్రాయలు

    కంగన ట్వీట్‌పై భిన్నాభిప్రాయలు

    కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న రైతులను ఉద్దేశించి కంగన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. దేశానికి అన్నదాత అయిన రైతులను టెర్రరిస్టులనే విధంగా ట్వీట్ చేయడం తప్పు. ఈ విషయంలో ఆమె తన వ్యాఖ్యలను సరిద్దిద్దు కోవాలనే వాదన సోషల్ మీడియాలో వినిపిస్తున్నది.

    English summary
    Kangana Ranaut's tweet in controversy. She tweeted that, People who spread misinformation and rumours about CAA that caused riots are the same people who are now spreading misinformations about Farmers bill and causing terror in the nation, they are terrorists. You very well know what I said but simply like to spread misinformation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X