»   » టాప్ హీరోలంతా నన్ను అన్ని రకాలుగా వాడుకున్నారు... చాలా మంది హీరోయిన్లనూ..

టాప్ హీరోలంతా నన్ను అన్ని రకాలుగా వాడుకున్నారు... చాలా మంది హీరోయిన్లనూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో ఫ్యాష‌న్‌కు కేరాఫ్ అడ్ర‌స్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌. ఫ్యాష‌న్‌లో కొత్త‌ద‌నాల‌ను వెతుకుతూ ఎప్ప‌టిక‌ప్పుడు న్యూట్రెండీ లుక్‌తో అంద‌రినీ అబ్బుర‌ప‌రుస్తుంటుంది. కంగ‌నా జీవ‌న‌శైలిలోనే కాదు త‌న న‌ట‌న‌లో కూడా ఫ్యాష‌న్ క‌నిపిస్తుంది. బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా ఎన్నో అద్బుత‌మైన పాత్ర‌లో న‌టించి త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుందిఇంట్లో అందరు విద్యావంతులు. ఈమె డాక్టరై ఉచితంగా వైద్యం అందించాలని పెద్దవాళ్ళ ఆశ.

kangana

పన్నెండో తరగతిలో యూనిట్ టెస్టులో ఫెయిలై, తాను మెడికల్ ఎంట్రన్స్ ఎలా పాసవుతాను అనుకొందట కంగన. చదువు తప్ప ఇంకా ఏపని వద్దన్నాడు తండ్రి. ఇల్లు వదలి వచ్చేసింది. పేదరికంతో తిండికి కూడా ఇబ్బంది పడింది. ఆమె కొత్త కెరీర్ వెతుక్కుంటూ వచ్చింది. అది మేడలింగ్,ఆపని చేస్తు థియేటర్ ఆర్ట్సలోకి వెళ్ళింది. గిరీష్ కర్నడే రాసిన నాటకంలో అమ్మయిగా అబ్బయిగా కంగనా నే నటించింది. అప్పటికి కంగనా వయస్సు 17 సంవత్సరాలు. థీయేటర్ నుండి సినిమా రంగం వైపు నడిచింది.

మొదటి సినిమాకే ఫిల్మ్ ఫేర్ అవార్డ వచ్చింది. ప్యషన్ సినమాలో మోడల్గా ఆమె నటనకు జాతీయ ఉత్తమ సహాయనటి అవార్డ, క్వీన్ చిత్రంలో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని సినీ రంగ శిఖరాగ్రంపైనే నిలబడింది. స్టార్ స్టేటస్లో ఉన్నప్పుడే న్యూయార్కులో స్ర్కిప్టు రైటింగ్ కోర్సు చేసింది కంగనా. జీవితం ఒకే దగ్గర ఆగి పోవటం నాకు ఇష్టం లేదని చెప్పే కంగనా జీవితం ఓ సక్సఫుల్ సినిమా లాంటిది. కానీ ఆ స్థయికి చేరుకొనేలోగా ఆమె ఎన్ని ఆటు పోట్లు భరించింది. అందుకేనేమో తాను మనసులో అనుకున్నదాన్ని సూటిగా చెప్పి తీరుతుజ్ఞ్ది... వివాదాలు కంగన కు కొత్త కాదు... ఇప్పుడూ మరో వివాదం తో తెరమీదికి వచ్చిందీ క్వీన్...

kangana-2

నటనలో, ప్రవర్తనలో విలక్షణతకు పెట్టింది పేరు. ఆ విలక్షణతలో కూడా హుందాతనానికి మారు పేరు. గాడ్ ఫాదర్‌లు ఎవరూ లేకుండా కేవలం తన ప్రతిభతో బాలీవుడ్‌లో అగ్ర కథానాయకిగా ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాదు, భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు కంగనా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి కంగనా తాను హీరోయిన్‌గా అవకాశాలు పొందడానికి టాప్ హీరోల అన్ని రకాల కోరికలను తీర్చాల్సి వచ్చిందని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇటీవల హృతిక్ విషయంలో ఒక వివాదంలో ఇరుక్కుంది. ఈ వివాదం నుంచి బయట పడినప్పటికీ, తాజాగా ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో ఒక్క సారి కలకలం రేపాయి.

టాప్ హీరోలంతా తనను అన్ని రకాలుగా ఉపయోగించుకున్న వాళ్లేనని కంగనా తేల్చేసిందనే వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తానొక్కతే కాకుండా, మిగిలిన టాప్ హీరోయిన్లందరూ కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారని కూడా చెప్పుకొచ్చిందట కంగనా. అంతేనా, పెద్ద హీరోలు పైకి కనిపించేంత మంచోళ్లు కాదని, వాళ్లందరకీ పరువు సంతోషాలు కాకుండా 'పరుపు సంతోషాలే' ముఖ్యమని కూడా చెప్పడంతో బాలీవుడ్ హీరోలంతా షాక్ తిన్నారట. దీంతో ఏం చేయాలో అర్థంకాని సదరు హీరోలు, కంగనాకు ఫోన్ చేసి ఆమెతో, ఇతర హీరోయిన్లతో తమకున్న సంబంధాల వివరాలను బయటపెట్టొద్దని బతిమాలుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయ్ మరి.

English summary
Kangana Ranaut has allegedly said that she had to fulfill all sorts of desires of almost all the top heroes for pocketing offers. Kangana also reportedly claimed that not just her, all the contemporary top heroines have gone through this phase.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu