twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగులో ‘కాంచీవరం’

    By Staff
    |

    తెలుగు, తమిళంలోనే కాకుండా రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఎంటరై హింది చిత్రం'వాంటెడ్" తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రకాష్ రాజ్ వ్యాల్యూ అమాంతం పెరిగిపోయింది. తమిళంలో రూపొందిన కాంచీవరం చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడు. ఈ చిత్రానికి గాను ప్రకాష్ రాజ్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టి, జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును కూడా దక్కించుకొన్న చిత్రం 'కాంజీవరం'. పెర్ సెప్ట్ కంపెనీ, ఫేర్ ఫ్రేమ్ పిక్చర్స్ పతాకంపై శైలేంద్ర సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.శ్రీకుమార్ సంగీతం అందించారు. అక్టోబర్ చివరి వారంలో 'కాంజీవరం' చిత్రం తెలుగులో విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి అనువదించి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

    తమిళనాడులోని కాంజీపురంలో స్వాతంత్ర్యానికి పూర్వం నేత కార్మికుల పరిస్థితికి అద్దం పడుతూ 'కాంజీవరం' రూపొందింది. ఇందులో చేనేత కార్మికుడైన ప్రకాష్ రాజ్ తన కలలకూ, కమ్యూనిస్టు భావజాలానికి మధ్య సతమతమయ్యే పాత్రను ప్రతిభావంతంగా పోషించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆనాటి పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్ కు జోడిగా పొగరు చిత్రం లో లేడి విలన్ పాత్ర ను పోషించిన 'శ్రియారెడ్డి" నటించింది. ప్రకాష్ రాజ్ బాలీవుడ్ లో సైతం అడుపెట్టి బాలీవుడ్ లోనూ ప్రకాష్ రాజ్ వ్యూల్యూ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ నిర్మాతలు ప్రకాష్ రాజ్ ని తమ సినిమాలో నటింపచేయటానికి సిద్దపడుతున్నారట. ఈ నేపధ్యంలో బాలీవుడ్ సినిమాల రేంజ్ పెద్దది కాబట్టి ప్రకాష్ రాజ్ కి ఎంతటి పారితోషికం ఇవ్వటానికి బాలీవుడ్ నిర్మాతలు వెనుకాడరని చెప్పొచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X