భార్యను వేధించిన హీరో అర్జున్ అరెస్ట్
కొన్ని రోజులుగా సతాశ్రీ హోసరుగట్ట సమీపంలో ఓ అపార్ట్ మెంటులో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. మంగళవారం రాత్రి అర్జున్ తన సోదరుడు, బంధువుతో కలిసి ఆమె ఉంటున్న అపార్టమెంటు వద్దకు వచ్చి గొడవ చేసాడు. సెక్యూరిటీ గార్డు చంద్రప్ప అడ్డు పడటంతో నేను సినిమా హీరోను...నన్నే ఆపుతావా అంటూ అతన్ని చితకబాదాడు.
ఈ గొడవ నేపథ్యంలో అపార్ట్ మెుంటులోని ఇతరులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకన్న వారు హీరో అర్జున్ తో పాటు అతనితో వచ్చి ఇద్దరి అరెస్టు చేసి కేసు నమోదు చేసారు. లతాశ్రీ కూడా పోలీస్టేషన్ కు వెళ్లి తన భర్త దురాగాతలపై ఫిర్యాదు చేసింది.
అతిగా మద్యం సేవించడం వల్లనే అర్జున్ ఇలా గొడవకు దిగి పరువు పోగొట్టుకోవడంతో పాటు అరెస్టయినట్లు స్పష్టం అవుతోంది. తనను కొన్నేళ్లుగా వేధిస్తున్నాడని భార్య మళ్లీ కేసు పెట్టడంతో మరికొన్ని రోజుల పాటు ఈ కన్నడ హీరో జైల్లోనే ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
