Puneeth Rajkumar: గర్వించే పని చేసిన పునీత్.. చనిపోతూ మరో ఇద్దరికి వెలుగులు!

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అనారోగ్య సమస్యలతో బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ రోజు (అక్టోబర్ 29) తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఆయన మరణిస్తూ మరో ఇద్దరికి వెలుగులు నింపుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

జిమ్ చేస్తూ

జిమ్ చేస్తూ

శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తున్న ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే రమణ శ్రీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం తదుపరి చికిత్స నిమిత్తం విక్రమ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చేర్పించినప్పటి నుంచి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్ను మూశారు.

 46 ఏళ్ల వయసులో

46 ఏళ్ల వయసులో

46 ఏళ్ల వయసులో ఆయన మరణించడంతో శాండల్ వుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఈరోజు ఉదయం ఆయన మరణ వార్త ప్రభుత్వానికి అందిన వెంటనే కర్ణాటక మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. సినిమా థియేటర్లు మూసేశారు. కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు పలువురుసినీ ప్రముఖులు ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

29కి పైగా కన్నడ చిత్రాల్లో

29కి పైగా కన్నడ చిత్రాల్లో

కన్నడ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన రాజ్ కుమార్ ఐదో సంతానం అయిన పునీత్‌ని అభిమానులు అప్పూ అని ప్రేమగా పిలుచుకుంటారు. లెజెండరీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్, పార్వతమ్మలకు మూడో కుమారుడు. పుట్టిన ఏడాది నుంచే సినిమాల్లో కనిపించడం మొదలు పెట్టిన పునీత్ 1999లో వివాహం చేసుకున్నారు. పునీత్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు ధృతి, వందిత. పునీత్ దాదాపు 29కి పైగా కన్నడ చిత్రాల్లో నటించి అభిమానులను అలరించారు.

అప్పు గా మారి

అప్పు గా మారి

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన పునీత్ 1985లోనే "బెట్టాడ హూవు"లో తన నటనకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్నాడు. "చలిసువ మోడగలు", "ఎరడు నక్షత్రాలు" వంటి చిత్రాలలో నటనకు బాలనటుడిగా పునీత్ కర్ణాటక రాష్ట్ర ఉత్తమ అవార్డు గెలుచుకున్నాడు. అలా ఆయన "అప్పు" (2002)తో పునీత్ హీరోగా మారాడు.

అదే పేరు పునీత్ పేరుగా మారింది. ఆ తర్వాత అతని అభిమానులు అతన్ని అప్పూ అని పిలవడం మొదలు పెట్టారు. అభి, వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, హుడుగారు, అంజనీ పుత్ర వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన పునీత్ చివరిసారిగా ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన "యువరత్న"లో కనిపించాడు.

నేత్ర దానం

నేత్ర దానం

కన్నడ ఇండస్ట్రీలోనే పవర్ స్టార్ గా క్రేజ్ ను సంపాదించుకుని రాజ్ కుమార్ తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ఆయన మరణించడంతో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటి అంటే పునీత్ రాజ్ కుమార్ తన కళ్ళను దానం చేశారు. దీంతో ఆయన కళ్ళతో మరో ఇద్దరు ప్రపంచాన్ని చూడనున్ననారు. పునీత చనిపోయిన ఆరు గంటల లోపు ఆయన కళ్లను తీసి భద్రపరచాల్సి ఉంటుంది.

Recommended Video

Sharukh ని Atlee కాపాడతాడా? | Pathan Movie కి 100 కోట్లు
తల్లి తండ్రుల బాటలోనే

తల్లి తండ్రుల బాటలోనే

నిజానికి పునీత్ రాజ్ కుమార్ తల్లిదండ్రులు కూడా తమ కళ్లను దానం చేయగా ఆ కళ్ళతో నలుగురికి చూపు రప్పించగలిగారు వైద్యులు. ఇక పునీత్ రాజ్ కుమార్ తన తండ్రి బాటలోనే తన కళ్ళను కూడా దానం చేశారు. పునీత్ రాజ్ కుమార్ మాత్రమే కాక శివ రాజ్ కుమార్ కూడా తన కళ్ళను దానం చేశారు. పునీత్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ ఆయన చివరిగా నటించిన సినిమా యువరత్న తెలుగులో కూడా రిలీజ్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X