సంచలనం: యువతిపై కన్నడ నటుడి రేప్!.., యాసిడ్ దాడి చేస్తానని బెదిరింపులు..

Recommended Video

యువతిపై కన్నడ నటుడి రేప్ !

చిత్ర సీమలో అత్యాచారాలపై తారలు గొంతెత్తుతున్న తరుణమిది. గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపులపై 'మీ టూ' అనే హాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. పలువురు హీరోలు కూడా వారికి మద్దతు నిలుస్తున్నారు.

ఇలాంటి తరుణంలో ఓ సామాన్య మహిళ తనపై ఓ నటుడు అత్యాచారం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటీ వివాదం..

 యువతిపై సుబ్రహ్మణ్యం రేప్..:

యువతిపై సుబ్రహ్మణ్యం రేప్..:

హెంబణ్ణ చిత్రం ద్వారా కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన నటుడు సుబ్రహ్మణ్య తనపై అత్యాచారం చేశాడని 23ఏళ్ల ఓ యువతి బసవగుడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అసలేంటీ వివాదం:

అసలేంటీ వివాదం:

నిజానికి ఆ యువతి, నటుడు సుబ్రహ్మణ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజాజీ నగర్ లో ఉండే ఆ యువతికి, తీర్తహళ్లిలో ఉండే సుబ్రహ్మణ్యం ప్రేమ గురించి వారి ఇళ్లలోనూ తెలుసు.

ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతి ఇంట్లో వాళ్లను కూడా సుబ్రహ్మణ్య ఒప్పించాడు. అయితే తన చిత్రం హెంబణ్ణ రిలీజ్ కు సిద్దమవడంతో.. కొన్నాళ్లు పెళ్లి వాయిదా వేద్దామన్నాడు. దానికి యువతి తల్లిదండ్రులు సరేనన్నారు.

మళ్లీ వాయిదా వేసిన సుబ్రహ్మణ్యం..:

మళ్లీ వాయిదా వేసిన సుబ్రహ్మణ్యం..:

అయితే హెంబణ్ణ చిత్రం విడుదలై మంచి గుర్తింపు వచ్చిన తర్వాత కూడా సుబ్రహ్మణ్య ఆ యువతిని పెళ్లి చేసుకోలేదు. కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నానని, ఆ తంతు పూర్తయ్యాక పెళ్లి పెట్టుకుందామని అన్నాడు. దానికి కూడా యువతి, ఆమె తల్లిదండ్రులు సరేనన్నారు. అప్పటికీ ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు సాగుతున్నాయి.

 యాసిడ్ దాడి బెదిరింపు..

యాసిడ్ దాడి బెదిరింపు..

ఓవైపు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తూనే.. మరోవైపు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే యాసిడ్ దాడి చేస్తానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు.

 కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి..:

కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి..:

పెళ్లి గురించి యువతి ఒత్తిడి చేస్తున్న క్రమంలోనే.. సుబ్రహ్మణ్యం గత నవంబర్ 1న ఆమెను తన సోదరి ఇంటికి పిలిచాడు. సోదరి ఇంట్లో ఫంక్షన్ పేరు చెప్పి యువతిని రప్పించాడు. తీరా తన వద్దకు వెళ్లాక.. సోదరి ఇంటికి కాకుండా, సుబ్రహ్మణ్యం ఆమెను అతని గదికి తీసుకెళ్లాడు. అక్కడే కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చి.. ఆపై ఆమె మీద అత్యాచారం జరిపాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఈ వివరాలు పేర్కొన్నారు.

వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ!:

వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ!:

ఇంత జరిగినా.. తనను పెళ్లి చేసుకుంటావా? లేదా? అని అడిగితే.. తన సినిమాకు ఓ యువతి రూ.20లక్షలు పెట్టుబడి పెట్టిందని, కాబట్టి ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ప్రేమించిన యువతిది పేద కుటుంబ నేపథ్యం కావడంతో ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. అంతేకాదు, ఆ యువతిపై, ఆమె తల్లిదండ్రులపై లేనిపోని దుష్ప్రచారం చేశాడు.

 చంపేస్తానని హెచ్చరిక..:

చంపేస్తానని హెచ్చరిక..:

తమ కుటుంబంపై చేస్తున్న దుష్ప్రచారంపై సుబ్రహ్మణ్యంను నిలదీస్తే.. తనను చంపేస్తానని బెదిరించినట్లుగా బాధిత యువతి వాపోయారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బసవగుడి పోలీసులు సుబ్రహ్మణ్య కోసం వేట ప్రారంభించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X