Virendra Babu Arrested: ఇండస్ట్రీలో తీవ్ర కలకలం.. రేప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

సినీ ఇండస్ట్రీలో కలకలం రేగుతోంది. ఓ కన్నడ పరిశ్రమకు చెందిన ఓ నటుడిపై రేప్ కేసు నమోదు అయింది. అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళను కన్నడ నటుడు విరేంద్ర బాబు రేప్ చేశాడని కేస్ నమోదు కావడంతో కర్ణాటక సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో.. బెంగళూరు పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. మహిళలపై అత్యాచార ఘటనలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే అందులో బాధితులు, నిందితులు.. ప్రముఖులు అయితే హాట్ టాపిక్ గా మారడం సహజమే. ఇప్పుడు కన్నడ నాట ఓ నటుడుపై అత్యాచార ఆరోపణలు రావడంతో.. బెంగళూరు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇప్పుడు కన్నడ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

Veerendra Babu

కన్నడకు చెందిన వీరేంద్రబాబు అనే నటుడిపై రేప్ కేసు నమోదం కావడం కలకలం రేపుతోంది. 2011 సంవత్సరంలో స్వయం కృషి అనే సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోనటుడిగా ఆయన అడుగు పెట్టారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. నిర్మాత కూడా. అయితే అత్యాచార ఆరోపణల నేపథ్యంలో బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళను వీరేంద్ర బాబు రేప్ చేశాడని కేస్ నమోదు అయింది. దీనితో కర్ణాటక సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

నటుడు వీరేంద్ర బాబు... తనను అత్యాచారం చేసిన తర్వాత దానికి సంబంధించిన వీడియో చూపిస్తూ బెదిరిస్తున్నాడని ఆ మహిళ వాపోయింది. ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 15 లక్షల రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారని తెలిపింది. ఒకవేళ ఇవ్వకపోతే... ఆ వీడియోను లీక్ చేస్తానంటూ బెదిరించేవాడంటూ ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. అయితే ఈ అత్యాచార ఘటన 2021లో జరిగందని తెలుస్తోంది.

Veerendra Babu

బాధిత మహిళ నగలు అమ్మి వీరేంద్రకు డబ్బులు ఇచ్చిందని తెలుస్తోంది. గత జలై 30 వ తేదిన కూడా విరేంద్ర మళ్లీ ఫోన్ చేసి బెదిరించినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఒకసారి ఆ మహిళను కారులో తిప్పి బెదిరింపులకు పాల్పడి బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు తెలిపారు. అతడు బెదిరించడమే కాకుండా గన్‌తో చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆ మహిళ ఫిర్యాదులో స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... వీరేంద్ర బాబు, అతని స్నేహితులపై అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. వీరేంద్ర బాబుపై చీటింగ్ కేసుతో సహా తాజాగా రేప్ కేసు నమోదవ్వడం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X