twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నేడు ఆతడిని కాదు ఆమెను' : జాతీయ అవార్డు దీనికే

    By Srikanya
    |

    బెంగళూరు : జాతీయ ఉత్తమ నటుడుగా సంచారి విజయ్‌ ఎంపికయ్యారు. 'నాను అవనల్ల అవళు' (నేడు ఆతడిని కాదు ఆమెను) సినిమాలో అభినయానికి ఈ పురస్కారం లభించింది. దిల్లీలో 62వ జాతీయ సినిమా పురస్కారాల్ని మంగళవారం ప్రకటించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'హరివు' సినిమాకు పురస్కారం లభించింది. మే నెలలో పురస్కారాల్ని ప్రదానం చేస్తారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    హిజ్రాల జీవన యానం ఇతి వృత్తంతో..

    హిజ్రాల జీవనయానం ఇతి వృత్తంతో దర్శకుడు లింగదేవరు 'నాను అవనల్ల అవళు' సినిమాను రూపొందించారు. తమిళంలో విద్య అనే హిజ్రా ఆత్మచరిత్ర 'ఐ యామ్‌ విద్య' ఆధారంగా సినిమా రూపొందింది. రవి గిరాణి ఈ సినిమాకు నిర్మాత. కథ విషయానికొస్తే.. 'చిన్నవయస్సులో కాస్తంత విచిత్రంగా ప్రవర్తించడాన్ని గుర్తించిన స్నేహితులు ఆ బాలుడిని హేళన చేస్తారు. తల్లిదండ్రులు మందలించినా ప్రయోజనం లేదు.

    ఇక లాభం లేదనుకుని ఆ బాలుడిని బెంగళూరులోని సోదరి నివాసానికి పంపుతారు. వయస్సు పెరిగే కొద్దీ ఆ బాలుడు విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఎవరూ లేని సందర్భాన్ని చూసుకుని చీర కట్టుకోవడం, మహిళ తరహాలో వ్యవహరిస్తుంటాడు. ఓ సమయంలో హిజ్రా పరిచయం అవుతుంది. ఆమె తమ ముఠా వద్దకు తీసుకెళ్తుంది. ఈ జీవితంలోకి రావద్దని ముఠా నాయకురాలు మందలిస్తుంది. ఫలితం కనిపించదు.

    తాను మహిళగానే కొనసాగాలని తీర్మానించిన ఆ యువకుడు శస్త్రచికిత్స చేయించుకుంటాడు. హిజ్రాలు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారో దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపాడు. ఇందులో దాదాపు 150 మంది హిజ్రాలు నటించారు. బెంగళూరు, పూణె, కడప పరిసరాల్లో చిత్రీకరించారు.

    Kannada Actor Vijay Wins Best Actor Title for 'Nanu Avanalla Avalu'

    సంచారి విజయ్ విషయానికి వస్తే....

    రంగస్థలం నుంచి ప్రస్థానం ఆరంభమైంది. మాలతీష్‌ బడిగార్‌, ఛాయాభార్గవి, మంజునాథ బడిపీర్‌, ఎం.సి.ఆనంద్‌, ఎస్‌.ఆనంద్‌, జోసెఫ్‌, మహేష్‌ పల్లకి తదితరుల వద్ద నాటక రంగంలో అనుభవాన్ని గడించాడు. ఎన్‌.మంగళ ఆధ్వర్యంలోని సంచారి నాటక మండలిలో పనిచేసినందున సంచారి విజయ్‌గా పేరొచ్చింది.

    ఎనిమిది సంవత్సరాల పాటు రంగస్థలంలో కొనసాగిన తరువాత దూరదర్శన్‌ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు. అనేక ధారావాహికల్లో ప్రతిభను చాటుకున్నాడు. వెండితెరకు పరిచయం అయిన విజయ్‌ రంగప్ప హోగ్బిట్న, రామ రామ రఘురామ, విలన్‌, దాస్వాళ, ఒగ్గరణె తదితర సినిమాల్లో నటించాడు.

    ఇక కన్నడ నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'హరివు' విషయానికి వస్తే...

    గ్రామీణులు పట్నానికి వస్తే ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందనే కథాంశంతో హరివు సినిమా రూపొందింది. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన రైతు ఒకరు అనారోగ్యంతో ఉన్న కొడుకును బెంగళూరు వైద్యాలయానికి తీసుకొస్తాడు. చికిత్స ఫలించక కొడుకు కన్నుమూస్తాడు.

    శవాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లే సమయంలో ఎలా వంచనకు గురవుతాడనే కథాంశంతో హరివు రూపొందింది. సంచారి విజయ్‌, శ్వేతా దేశాయ్‌, అరవింద్‌ కుప్లికర్‌, మధుశ్రీ, షోయెబ్‌, ఎం.సి.ఆనంద్‌, చేతన్‌, శేషన్‌ ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు నిర్మాత అవినాశ్‌ షెట్టి, దర్శకుడు- మంజునాథ సోమశేఖరరెడ్డి

    English summary
    Vijay receives Best Actor Award for "Nanu Avanalla Avalu" movie directed by "B.S. Lingadevaru".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X