For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెక్సీ హీరోయిన్ రాజకీయాలకు అంతా షాక్

  By Srikanya
  |
  బెంగళూరు : వెండితెరపై జరిగినట్లుగానే నిజ జీవితంలో కథ తిరుగుతోంది. చేరిన సంవత్సరం లోపే రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరితేరాలని ఆమె ఆరాటపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో సంచలనం సృష్టిస్తూ జేడీఎస్‌లో చేరిన అందాల నటి పూజాగాంధీ అంతలోనే జెండా ఫిరాయించారు. 'ఇంక జేడీఎస్‌కు మీ సేవలు చాలు తల్లీ' అని ఆ పార్టీ నేత కుమారస్వామి ప్రకటించిన తరువాత కొన్నాళ్లు మౌనంగా ఉన్న ఆమె... ఇప్పుడు కాబోయే భర్తతో సహా కేజేపీలో చేరి రెండో రాజకీయ ఇన్నింగ్స్‌కు కొంగు బిగించారు.

  మల్లేశ్వరంలోని కర్ణాటక జనతా పార్టీ కార్యాలయంలో సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ నేతలు పూజాగాంధీని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నిరుపేదలు, రైతుల పక్షాన నిలిచిన కేజేపీకి సేవలందించాలని వచ్చానని పూజా వెల్లడించారు. పార్టీతాత్కాలిక అధ్యక్షుడు ధనంజయకుమార్ ఆమెకు పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కేజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని పూజాగాంధీ ప్రకటించారు. మరికొందరు సినీ నటులు కేజేపీలో చేరేందుకు ఆసక్తితో ఉన్నారని ధనంజయకుమార్ వెల్లడించారు.

  నటి పూజాగాంధీ... యడ్యూరప్ప ఆధ్వర్యంలోని కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) తీర్థం స్వీకరించారు. కాబోయే భర్త ఆనందగౌడతో కలిసి కేజేపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆమెకు కేజేపీ నాయకుడు విజయకుమార్‌ పార్టీ పతాకాన్ని అందజేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యడ్యూరప్ప రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌, మహిళల కోసం వేర్వేరు పథకాల్ని ప్రవేశపెట్టిన ఘనతను సొంతం చేసుకున్నారని, అందుకే తాను కేజేపీలో చేరుతున్నట్లు పూజా ఈ సందర్భంగా ప్రకటించారు. హావేరిలో ఆదివారం నిర్వహించే సభలో పాల్గొని తాను పార్టీలో పూర్తి స్థాయి కార్యకర్తగా కొనసాగుతానని తెలిపారు. జేడీఎస్‌లో తనకు సరైన ప్రాతినిధ్యం దక్కని నేపథ్యంలో ఆ పార్టీకి దూరం కావలసి వచ్చిందన్నారు. పార్టీ సూచించిన మార్గంలో తాను ప్రజా సేవలో పాల్గొంటానని చెప్పారు.

  సీనియరు నటి మాలాశ్రీ, శృతిలతో పాటు మరికొందరు చిత్రరంగ ప్రముఖులు కేజేపీలో త్వరలో చేరతారని నట, దర్శక నిర్మాత మదన్‌ పాటిల్‌ తెలిపారు. జెడియు సీనియరు నాయకుడు మైఖేల్‌ ఫెర్నాండెజ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు కార్యకర్తలతో సహా పార్టీలో చేరతారన్నారు. పూజా చేరిక తరువాత కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిల్ని తినిపించుకుని సంబరం చేసుకున్నారు. పూజాగాంధి జేడీఎస్‌కు గుడ్‌బై చెప్పి కేజేపీలో చేరటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఆమె జేడీఎస్‌లో ఇమడలేకే పార్టీని వీడారని అన్నారు.

  English summary
  Days ahead of its formal launch, the fledgling Karnataka Janata Party headed by former Chief Minister B S Yeddyurappa got a glamorous touch with popular Kannada movie heroine Pooja Gandhi joining the party after quitting JDS.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X