సంచలన నిర్ణయం: గోవా చిత్రోత్సవ బహిష్కరణ

By Srikanya

బెంగళూరు : కళసా బండూరి నీటి పథకం విషయంలో గోవా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ చందనసీమ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్ని బహిష్కరించాలని తీర్మానించింది. ఈ నెల 20 నుంచి 30 వరకు చలనచిత్రోత్సవాల్ని నిర్వహించనున్నారు.

ఇక్కడ సమావేశమైన చలనచిత్ర వాణిజ్య మండలి ఈ మేరకు తీర్మానించింది. సమావేశం వివరాల్ని మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు వెల్లడించారు. చలనచిత్రోత్సవాలకు చిత్రసీమ నుంచి పాల్గొనడం లేదని చెప్పారు. అవార్డు పొందిన 'నాను అవనల్ల అవళు' సినిమా ప్రదర్శనకు మాత్రం తీర్మానం నుంచి మినహాయించారు.

ఈ ఫిల్మోత్సవ్‌లో దాదాపు 34 దేశాల నుండి 131 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. కేరళ రాష్ట్రంలోని 18 ప్రధాన పట్టణాలలో ఈ సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ ప్రారంభించనున్నారు. దక్షిణాసియాలోని అత్యంత పెద్ద ఫిలిం మార్కెట్‌గా పిలువబడే ఇండీవుడ్‌ ఫిలిం మార్కెట్‌ సంస్థ ఈ ఉత్సవానికి ప్రాయోజకులుగా వ్యవహరిస్తున్నారు.

Kannada Cinema industry to boycott Goa international film fest

'ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులతోపాటు సినిమా ప్రేమికులు భారీ సంఖ్యలో ఈ ఫిల్మోత్సవ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా యాభైఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రముఖ మలయాళ దర్శకుడు ఆదూరి గోపాలకృష్ణన్‌ను ఘనంగా సత్కరించబోతున్నాం. అలాగే ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత యష్‌చోప్రాకు ఈ ఉత్సవంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈ ఫిల్మోత్సవ్‌లో 'గోల్డెన్‌ ఫ్రేం' అవార్డు కోసం 50 చిత్రాలు పోటీ పడుతున్నాయి.

వీటితోపాటు తొలిసారి తీసిన సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలకు కూడా పోటీ ఉంటుంది. ఇరానియన్‌ దర్శకుడు ఖోశ్రో మాసౌమి నేతృత్య వహిస్తున్న జ్యూరీ ఈ సినిమాలను సమీక్షిస్తుంది. ప్రపంచంలో అత్యంత పెద్ద ఫిలిం మార్కెట్‌గా భారత్‌ను నిలపాలనే లక్ష్యం దిశగా ఈ ఉత్సవాలను నిర్వహించడం గొప్ప విషయం.

ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ఫిల్మోత్సవ్‌ను నిర్వహించేందుకు కేరళ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాల్ని అందిస్తోంది' అని సంస్థాపక డైరెక్టర్‌ సోహాన్‌రారు తెలిపారు. 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆదూరి గోపాల్‌కృష్ణన్‌కు ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఘన సన్మానం ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X