కన్నడ హీరో విష్ణువర్థన్ మృతి
కన్నడ హీరో విష్ణువర్థన్(59) నిన్న రాత్రి మైసూరులో హార్ట్ ఎటాక్ తో మృతిచెందారు. ఇప్పటివరకూ 199చిత్రాల్లో నటించిన ఆయన 2005లో బెంగుళూరు యూనివర్సటీ నుంచి డాక్టరేట్ పొందారు. పుట్టణ్ణ కణగాల్ దర్శకత్వం వహించిన నాగరహావు సినిమాతో ఆయన తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. గిరీషు కర్నాడ్ దర్శకత్వం వహించిన వంశవృక్షం చిత్రానికి ఉత్తమ జాతీయ నటుడి అవార్డు సాధించారు. అలాగే ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అనేక మార్లు స్టేట్ గవర్నమెంట్ అవార్డులును పొందారు. 2004లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ అచీవ్‌మెంట్, 2009లో డా.రాజకుమార్ అవార్డులు ఆయన పొందారు.
1950సెప్టెంబర్ 18న కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించిన అసలు పేరు సంపత్ కుమార్. విష్ణు వర్ధన్ 1975 ఫిబ్రవరి 27 నటి భారతిని వివాహం చేసుకున్నారు. ఆయనకు కీర్తి, చందన అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సినిమా రంగంలోనే కాక ఆయన సామాజిక కార్యక్రమాలలోనూ ఆయన విస్తృతంగా పాల్గొనేవారు. ఆయన మరణానికి నివాళులు అర్పిస్తూ కర్నాటక గవర్నమెంట్ స్కూల్స్, కాలేజిలకు ఒక రోజు శెలవు ప్రకటించింది. ఆయన మరణానికి ధట్స్ తెలుగు మనస్ఫూర్తిగా నివాళి ప్రకటిస్తోంది.
విష్ణువర్ధన్ కు శ్రద్ధాంజలి ఘటించండి.


Click it and Unblock the Notifications











