»   » స్నేహితుడి ఇంట్లోనే వ్యభిచారం... డైరెక్టర్ అరెస్ట్

స్నేహితుడి ఇంట్లోనే వ్యభిచారం... డైరెక్టర్ అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్నేహితుడే కదా అని ఇంటిని అద్దెకు ఇస్తే... ఇష్టారాజ్యంగా వ్యవహరించి, బెదిరింపులకు దిగిన కన్నడ సినీ దర్శకుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే... 'కత్రిగుప్పె కట్టింగ్‌ షాప్‌' అనే సినిమా డైరెక్టర్‌ ప్రఖ్యాత్, తన స్నేహితుడైన పురుషోత్తమ్ కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.

ఆడిషన్స్ పేరు చెప్పి అమ్మాయిలకు వల వేసి లొంగదీసుకుని వ్యభిచారం చేయిస్తూ జల్సా చేస్తూ న్నాడు. ఈ వ్యవహారం మరీ ఎక్కువై ఇరుగు పొరుగు వాళ్లకు ఇబ్బంది కావడంతో విషయం కాస్త పోలీసులకు చేరింది ఇంకేముంది సదరు డైరెక్టర్ ని అరెస్ట్ చేసారు పోలీసులు . ఈ వ్యవహారం బెంగుళూర్ లో జరిగింది . ప్రఖ్యాత్ అనే డైరెక్టర్ తన స్నేహితుడైన పురుషోత్తం కు చెందిన ఇంటిని తాను తీయబోయే కొత్త సినిమా ఆఫీసు కోసం అద్దెకు తీసుకున్నాడు.

Kannada Film Director Held In Sex Racket

దీంతో ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు ఇబ్బంది పడి పరుషోత్తమ్ కు ఫిర్యాదు చేశారు. ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో పురుషోత్తం ఆ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి, విధానం మార్చుకోవాలని మిత్రుడికి సూచించాడు.

లేని పక్షంలో ఇంటిని ఖాళీచేయాలని హెచ్చరించాడు. డైరెక్టర్ ప్రఖ్యాత్ ఎదురు తిరగడమే కాకుండా కొంతమంది రౌడీలతో బెదిరించాడట దాంతో పోలీసులను ఆశ్రయించాడు ఇంటి యజమాని అయిన పురుషోత్తం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం తో ప్రఖ్యాత్ ని అరెస్ట్ చేసారు బెంగుళూరు పోలీస్.

English summary
A Kannada film director Named Prakhyath was arrested on Saturday for running a sex racket on the pretext of audition for new actors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu