పెద్దపులి ప్రభాకరన్ పై సినిమా

By Staff

AMR Ramesh
గతంలో రాజీవ్ హత్యా ఉదంతంపై సైనేడ్ అనే సినిమా చేసిన దర్శకుడు రమేష్ ఇప్పుడు పెద్దపులి ప్రభాకరన్ పై చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ నేను తప్పనిసరిగా ప్రభాకరన్ పై సినిమా చేస్తాను. తమిళంలో ఆయన తిరిగిన ప్రాంతాలు, శ్రీలంకలో ఆయన నివసించిన ప్రాంతాలు తిరిగి జర్నలిస్టులతో చర్చించి కథనం తయారు చేస్తాను. రీసెర్చి లేనిదే ఇలాంటి చిత్రాలు చేస్తే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే తన సైనేడు చిత్రాన్ని అప్పట్లో ప్రభాకరన్ చూసారని అతను ఉద్వేగంగా చెప్తున్నారు. ఆయన చాలా ఇష్టపడ్డారని ఆ తర్వాత తెలిసింది అన్నారు. ఆ సంభాషణను గుర్తు చేసుకుంటూ తమిళసెల్వం..ఎల్టీటీఐ పొలిటికల్ వింగ్ ఛీప్ ఆ విషయాన్ని ఫోన్ లో చెప్పారు. దాదాపు నలభై నిముషాలు పాటు మాట్లాడారు.

సైనైడ్ సినిమా చాలా బ్రిలియెంట్ గా తీసారని, నేను తమిళుడునా అని అడిగారని, తమిళులు మాత్రమే ఆ సమస్యను అంత సెన్సిటివ్ గా అర్ధం చేసుకుంటారని ఆయన అన్నారని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు తమిళ సెల్వం ఫోన్ చేసి ప్రభాకరన్ నన్ను కలవటానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. నా ఫ్యామిలీని తీసుకుని వాళ్ళు చెప్పిన ప్లేస్ కు రమ్మన్నారు. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను ఆ ఇన్విటేషన్ కి. కొలెంబో వచ్చి శ్రీలంక లోని మినిస్టర్స్ ని కలవమన్నారు. అప్పుడు అర్ధమైంది ఆయనకు ప్రభుత్వంలో ఎంత గ్రిప్ ఉందోనన్న విషయం. ఆ తర్వాత అనుకోని రాజకీయ పరిణామాల వల్ల అది మిస్సయ్యాను. ఇప్పుడు ఆయన లేరు. ఆయనపై తీయబోయే ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాంతాలను ఇప్పుడు వెళ్ళబోతున్నా అన్నారు.

అలాగే ప్రభాకరన్ ఎలా చూపబోతున్నారు తమిళుల రక్షకుడుగానా లేక టెర్రరిస్టు గానా అంటే ఆయనలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఆయన మన ప్రధాని రాజీవ్ హత్యకు కారకుడు. అది క్షమించరాని నేరు. అలాగే స్వేచ్చ కోసం ఆయన చేసిన పోరాటం కూడా ఆమోదించదగిందికాదు..అందులో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.అది మర్చిపోకూడదు. అయినా ఆయనంటే సానుభూతి ఉంది. ఆయన్ని కొందరు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తో పోల్చి ఆరాధిస్తూంటారు అది మర్చిపోకూడదు అన్నారు. ఇక రమేష్ మొదటి సినిమా సంతోష..బిజు భూకంపం బ్యాక్ డ్రాప్ లో తీసారు. అలాగే ఆయన లేటెస్ట్ ప్రాజెక్టు పోలీస్ క్వార్టర్స్ (టైటిల్) బాబ్రి విద్వసం పై ఆదారపడిన కథ. ఇక త్వరలోనే ప్రభాకరన్ కథ తెరకెక్కునుందని సమాచారం. ప్రభాకరన్ గా ప్రకాష్ రాజ్ చేసే అవకాశం ఉంది. మోహన్ లాల్ కూడా ఈ పాత్ర చేయటానికి ఆసక్తి చూపారు కానీ రామ్ గోపాల్ వర్మ గానీ,మణిరత్నంగానీ డైరక్ట్ చేస్తేనే చేస్తానన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X