»   » రిలీజ్‌కు నోచుకోని సినిమా: నిర్మాత ఆత్మహత్యాయత్నం (ఫోటోస్)

రిలీజ్‌కు నోచుకోని సినిమా: నిర్మాత ఆత్మహత్యాయత్నం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: రెండేళ్లయిన తాను నిర్మించిన సినిమా విడుదలకు నోచుకోక పోవడం, తద్వారా ఏర్పడ్డ ఆర్థిక నష్టాలు....వీటి నుండి ఎలా బయట పడాలో తెలయని అయోమయ పరిస్థితుల్లో ఓ నిర్మాత ఒక చావే శరణ్యం అని భావించాడు. పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం గమరించిన సన్నిహితులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు.

బెంగుళూరు నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడ్డ వ్యక్తి కన్నడ నిర్మాత శశికుమార్. నూతన కథానాయకుడు సందీప్ తో ‘ఆఫ్ మెంటల్' అనే చిత్రాన్ని రూ. 3.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన శశికుమార్ దాదాపు రెండు సంవత్సరాలుగా దాన్ని విడుదల చేయలేక అష్టకష్టాలు పడుతున్నారు.

ఇతర పెద్ద హీరోల సినిమాల కారణంగా తన సినిమాకు థియేటర్స్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాలేదని తెలుస్తోంది. ఆల్రెడీ సినిమా కోసం శశికుమార్ అప్పలు చేసారు. ఇపుడు సినిమాను రిలీజ్ చేయడానికి మరో 80 లక్షలు అవసరం కావడం, ఎంత ప్రయత్నించినా డబ్బు దొరకక పోవడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

శశికుమార్

శశికుమార్

ఆత్మహత్య యత్నానికి పాల్పడిన కన్నడ నిర్మాత శశి కుమార్.

ఆఫ్ మెంటల్

ఆఫ్ మెంటల్

సందీప్ హీరోగా శశికుమార్ ఆఫ్ మెంటల్ అనే చిత్రం తెరకెక్కించారు.

రూ. 3.25 కోట్లు..

రూ. 3.25 కోట్లు..

ఈ చిత్రానికి గాను ఆయన రూ. 3.25 కోట్లు ఖర్చు చేసారు.

అప్పులు

అప్పులు

సినిమా విడుదల కాక పోవడంతో అప్పులపాలైన శశి కుమార్ ఆత్మహత్య కు పాల్పడ్డారు.

English summary
Kannada Film 1/2 Mentlu (Half Mentlu) producer Shashi Kumar attempted to commit suicide on Thursday (February 18th) in Kamakshipalya, Bengaluru. Shashi Kumar has reacted to the media regarding this incident.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu