కన్నెపిల్ల ఓ పెళ్లయిన మగాడితో సంబంధం
పెళ్లికాని కన్నెపిల్ల ఓ పెళ్లయిన మగాడితో సంబంధం పెట్టుకుంటే దానివల్ల వచ్చే అనర్థాలు వాళ్ల జీవితాల్ని ఏ స్థాయికి తీసుకెళ్లాయో చెప్పే చక్కని రొమాంటిక్ ఫిల్మ్ ఇది. యువతని వేడెక్కించే యవ్వన క్రీడలతో, ప్రేక్షకుల్ని మైమరపించే మత్తైన సన్నివేశాలతో ఈ చిత్రం తయారయింది అంటూ తమ 'రంభ కేరాఫ్ భూలోకం' చిత్ర గురించి చెప్తున్నారు నిర్మాత కుమార్. కన్నడంలో హిట్టయిన 'రంభ' చిత్రాన్ని శ్రీ గాయత్రీ కంబైన్స్ పతాకంపై కుమార్ వి.ఆర్ తెలుగులో అనువదిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కుమార్ మీడియాతో మాట్లాడారు. కన్నె వయసులో ఆడపిల్లలకు ఎదురయ్యే సమస్యల్ని ఇతివృత్తంగా తీసుకుని దానికి ఎలాంటి పరిష్కారమయితే బాగుంటుందో చెప్పిన సినిమా ఇది అన్నారు. ఇది యూత్ ఫుల్ గ్లామరస్ ఎంటర్‌టైనర్ గా దీన్ని తీర్చిదిద్దారు. మిస్ బెంగుళూరు మేఘనా కృష్ణ ప్రధాన పాత్రలో నటించింది. చెడు మార్గంలో వెళ్లే యువతకి ఏ చిత్రం కనువిప్పు కలిగిస్తుంది. అనువాద కార్యక్రమాలన్నింటినీ పూర్తిచేసుకుని ఈ నెలాఖరులోగా చిత్రాన్ని విడుదల చేయాలని సంకల్పించాం అని చెప్పారు. మోహన్, రవి, గాయత్రి, విమల ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి బి. రామ్మూర్తి దర్శకుడు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











