ఇంకో వివాదం...షూటింగ్ రద్దు చేయాల్సిందే
బెంగళూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'లింగా' వివాదం కొనసాగుతోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం వివాదం రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపుతోంది. పర్యాటక నిషిద్ద ప్రాంతమైన లింగ నమక్కి వద్ద షూటింగ్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పర్యావరణ ప్రేమికుల వైపు నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మంగళవారం పర్యావరణ ప్రేమికుల ఒక్కూట ఆధ్వర్యంలో షూటింగ్ అనుమనితిని వెంటనే రద్దు చేయాలని అదనపు కలెక్టర్ నాగరాజ్ కు వినతి పత్రం అందచేసారు.
లింగనమక్కి డ్యాం సమస్యాత్మక ప్రదేశం కావటంతో పాటు పర్యాటకాన్ని పూర్తిగా నిషేథించారని, అదే విధంగా వీడియోలు, ఫొటోలు తీయటం నిషిద్దం అన్నారు. అలాంటి చోట ఏకంగా సినిమాకు అనుమతి ఇవ్వటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. వెంటనే ప్రబుత్వం స్పందించి ఆ చిత్రం షూటింగ్ ని ఆపుచేయాలని కోరారు.

ఇంతకు ముందు సైతం ఇదే చిత్రం షూటింగ్ కు మరో వివాదం ఎదురైంది. దాంతో పోలీస్ కాపాలా పెట్టి షూటింగ్ చేయాల్సి వచ్చింది. అప్పటి వివాద కారణం... కావేరి నదీ జలాల వివాదంలో కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడిన రజనీకాంత్‌కు రాష్ట్రంలో చిత్రీకరణలో పాల్గొనే నైతికత ఎక్కడుందని కన్నడ సంఘాల కార్యకర్తలు ప్రశ్నించారు. ఇక్కడికి సమీపంలోని ఐజూరు గ్రామంలో కస్తూరి కన్నడ సంఘం కార్యకర్తలు రజనీకాంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గత ఏడాది కావేరి వివాదం సందర్భంలో రజనీకాంత్ తమిళనాడుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడమే ఈ ఆక్రోశానికి కారణం.
దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కొన్నిటిని ఈ సినిమాలో చర్చించే అవకాసం ఉందని అంటున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, మార్పు తేవాలి అనే అంశంతో కథనం నడుస్తుందని అంటున్నారు. 'లింగా' అనేది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర పేరు అని, అలాగే ప్రారంభం నుంచి యువకుడైన రజనీ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇద్దరికి ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. రజనీ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. విలన్ గా జగపతిబాబు పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కీలకమై నిలుస్తుందని చెప్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత. రజనీకాంత్ మనవడు (ధనుష్- ఐశ్వర్య కుమారుడు) పేరు కూడా లింగా కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











