twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌పై కన్నడ హీరో దర్శన్ అక్కసు: తెలుగు సినిమాలను బ్యాన్ చేయాలంటూ అక్కడ ఫిర్యాదు

    |

    కన్నడ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో దర్శన్ ఒకడు. దాదాపు పాతికేళ్లుగా ఆ పరిశ్రమలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడీ హీరో. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకుని ఛాలెంజింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అతడు.. ఇప్పటి వరకు 52 చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'రాబర్ట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమపై అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, కర్నాటకలో టాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయాలని ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే...

    అలా మొదలైన కెరీర్... హాఫ్ సెంచరీతో

    అలా మొదలైన కెరీర్... హాఫ్ సెంచరీతో

    'మహాభారత' అనే సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు దర్శన్. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు చిన్న చిన్న పాత్రల్లో నటించాడతను. ఈ క్రమంలోనే హీరోగా మారి ఛాలెంజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకుని కన్నడంలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇలా ఇప్పటి వరకూ యాభైకి పైగా చిత్రాల్లో నటించి సత్తా చాటాడీ హీరో.

    కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా చేసిన ‘రాబర్ట్'

    కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా చేసిన ‘రాబర్ట్'

    తరుణ్‌ సుధీర్ దర్శకత్వంలో దర్శన్ నటించిన చిత్రం 'దర్శన్'. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఆశా భట్ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, రవికిషన్ కీలక పాత్రలు పోషించారు. ఉమాపతి ఫిల్స్ బ్యానర్‌పై ఉమాపతి శ్రీనివాస్ గౌడ నిర్మించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ. యాభై కోట్లు పైగానే జరిగింది.

    ఏడాది ఆలస్యం... రిలీజ్ డేట్ ఖరారైంది

    ఏడాది ఆలస్యం... రిలీజ్ డేట్ ఖరారైంది

    తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన 'రాబర్డ్' మూవీని వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌లోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. కానీ, కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో రిలీజ్‌ను ఆపేయాల్సి వచ్చింది. ఇక, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా రెండు భాషల్లో మార్చి 11న విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

    దర్శన్‌కు తెలుగు చిత్ర పరిశ్రమ సూచన

    దర్శన్‌కు తెలుగు చిత్ర పరిశ్రమ సూచన

    సంక్రాంతి సీజన్ తర్వాత సినిమాల విడుదల అంతగా ఉండదు. కానీ, ఈ సారి ఊహించని విధంగా శివరాత్రికి పలు తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో నితిన్ 'చెక్', శర్వానంద్ 'శ్రీకారం', నవీన్ పోలిశెట్టి 'జాతిరత్నాలు' సహా మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి. దీంతో 'రాబర్ట్' రిలీజ్‌ను వారం రోజులు వాయిదా వేయమని టాలీవుడ్ ప్రముఖులు దర్శన్‌కు సూచించారు.

    టాలీవుడ్‌పై కన్నడ హీరో దర్శన్ అక్కసు

    టాలీవుడ్‌పై కన్నడ హీరో దర్శన్ అక్కసు


    తన సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేయమని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలు కోరడంపై కన్నడ హీరో దర్శన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, తన సినిమాను రిలీజ్ డేట్‌ను ముందుగానే ప్రకటించానని ఆయన అంటున్నాడట. ద్విభాషా చిత్రం కావడంతో ఇక్కడ వాయిదా వేయడం కుదరదని తేల్చేశాడట.

    Recommended Video

    #MasterOnPrime : Aha కి Amazon Prime కి అదే తేడా !
    తెలుగు సినిమాలను బ్యాన్ చేయాలంటూ

    తెలుగు సినిమాలను బ్యాన్ చేయాలంటూ

    టాలీవుడ్‌లో తన సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో హీరో దర్శన్ కన్నడ చిత్ర నిర్మాతల మండలిని ఆశ్రయించినట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, తనకు ఎదురైన విషయాలపై వాళ్లకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది. అలాగే, కర్నాటకలో తెలుగు సినిమాలను బ్యాన్ చేయాలని కూడా వాళ్లను కోరినట్లు సమాచారం.

    English summary
    Production of the film began with the working title D53. Producers of the sandalwood movies Hebbuli and Ondalla Eradalla, Umapathy Films announced that they would collaborate with Darshan under the...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X