సెక్స్ స్వామి 'నిత్యానంద' గా నటిస్తున్న హీరో ఎవరంటే...
సెక్స్ స్కామ్ లో ఇరుక్కున్న స్వామి నిత్యానందపై రామ్ గోపాల్ వర్మ గాడ్ అండ్ సెక్స్ అనే చిత్రం చేద్దామనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనకు పోటీగా కన్నడంలో గజేంద్ర అజర్ అనే దర్శకుడు నిత్యానందపై ఓ చిత్రం చేయటానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇందులో హీరోగా కన్నడ హీరో రమేష్ అరవింద్ నటించనున్నారు. రమేష్ అరవింద్ గతంలో తెలుగులో సతీ లీలావతి, గోల్ మాల్ చిత్రాల్లో చేసారు. కొంత ఫన్, మరింత వాస్తవికత కలిగిన చిత్రంగా దీనిని రూపొందించటానికి గజేంద్ర ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వర్మ ఇప్పటికే ఈ స్క్రిప్టు పని మీద ఉన్నట్లు సమాచారం.,br />
ప్రజలందరు చేత గాడ్స్ మెన్ గా గుర్తింపుతెచ్చుకుని మన్ననలు అందుకుంటున్న ఈ బాబాలంతా చాలా నార్మల్ మనుష్యులు అని రామ్ గోపాల్ వర్మ చూపించబోతున్నాను. ఇవన్నీ ప్రక్కన పెడితే రమేష్ అరవింద్ మాత్రం తనని నిత్యానందగా చూపటాన్ని చాలా సంతోషంగా పేర్కొంటున్నాడు.


Click it and Unblock the Notifications











