»   » 'పవర్' ఫస్ట్ లుక్: 'దూకుడు'ని దింపేసారు (వీడియో)

'పవర్' ఫస్ట్ లుక్: 'దూకుడు'ని దింపేసారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం దూకుడు. ఆ చిత్రం లో విజువల్స్ ని మహేష్ స్టైల్స్ ని ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు దూకుడు ని యాజటీజ్ దింపేస్తూ..మహేష్ మ్యానరిజంస్ తో సహా 'పవర్' ఫస్ట్ లుక్ టీజర్ దూకింది. అయితే ఈ చిత్రం మహేష్...దూకుడు కి రీమేక్. 14 రీల్స్ వారే కన్నడంలోనూ నిర్మిస్తున్నారు. మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మహేష్ ని అనుకరిస్తూ పునీత్ రాజ్ కుమార్, త్రిష నటించారు. ఇదిగో వీడియో చూడండి...మీకు దూకుడు కన్నడ వెర్షన్ కనిపిస్తుంది.

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/tshkW2vUpp4" frameborder="0" allowfullscreen></iframe></center>

మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన తెలుగు చిత్రం 'దూకుడు' అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు అమితంగా ఆకట్టుకున్న సినిమాగా ఈ చిత్రం పేరు తెచ్చకుంది. ఈ చిత్రం త్వరలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా రీమేక్ చేయనున్నారు.

Kannada movie POWER First Look Teaser

ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లో నటించిన త్రిష పలు విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తొలిసారి ఆమె కన్నడలో 'దూకుడు' చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాకు త్రిష భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కన్నడ చిత్రసీమలో చర్చ జరుగుతోంది.

English summary
&#13; A lot of speculation has surrounded the name of Puneeth Rajkumar's upcoming film, which is the remake of the Telugu hit Dookudu. It was last reported that the movie will be named Power, owing to the fact that Puneeth is popularly referred to as the Power Star of Sandalwood.
Please Wait while comments are loading...