క న్నడ అమృతధారే తెలుగులో
కన్నడ సూపర్ హిట్ చిత్రం అమృతధారే ఆధారంగా తెలుగులో ఓ చిత్రం రూపొందుతోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో కాన్సెప్ట్ ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమా రీమేక్ జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఆరంభమైంది. "గత ఐదు రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం అని సంస్థ ప్రతినిధి జి.కె. తెలిపారు. కన్నడలో నాగత్తి హల్లి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ముప్పై వారాలు పూర్తయి ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోందని, ఆయనే ఈ తెలుగు చిత్రాన్నీ రూపొందిస్తున్నారని, ఇందులో అమితాబ్ బచ్చన్ నటించిన సన్నివేశాలను మినహా మిగిలిన వాటిని పున ర్నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న ఆశాభావాన్ని దర్శకుడు చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. ఇది ఓ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమని జయసుధ తెలిపారు.


Click it and Unblock the Notifications