For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కోసం పేరు మార్చుకున్న స్టార్ హీరో: ఇకపై నన్నలా పిలవకండి అంటూ ఫ్యాన్స్‌కు విన్నపం

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘమైన కెరీర్‌‌లో ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్‌ను కూడా సంపాదించుకున్నాడు. అదే సమయంలో పలు మైలురాళ్లను చేరుకోవడంతో పాటు ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ దేశ వ్యాప్తంగా సుపరిచితుడు అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్.. పవన్ కోసం తన పేరునే మార్చుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన పునీత్

  చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన పునీత్

  కన్నడంలో చాలా కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న సీనియర్ హీరో రాజ్‌కుమార్ తనయుడే పునీత్. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డును సైతం అందుకున్నాడు. ఇలా చిన్న వయసులోనే చాలా కాలం పాటు అదరగొట్టేశాడు.

  పూరీ జగన్నాథ్ పరిచయం చేశాడు

  పూరీ జగన్నాథ్ పరిచయం చేశాడు

  చాలా ఏళ్ల పాటు చైల్డ్ ఆర్టిస్టుగా వెలుగొందిన పునీత్ రాజ్‌కుమార్.. 2002లో ‘అప్పు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది అంతకు ముందే తెలుగులో ‘ఇడియట్' పేరుతో వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఘనమైన ఆరంభాన్ని అందుకున్న అతడు.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్లాడు.

  యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్‌లో సత్తా

  యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్‌లో సత్తా

  పునీత్ రాజ్‌కుమార్ కన్నడ సినీ పరిశ్రమలో ఆల్‌రౌండర్‌గా గుర్తింపును సంపాదించుకున్నాడు. దీనికి కారణం అతడు యాక్టింగ్‌ చేయడమే కాదు.. డ్యాన్సులు కూడా ఇరగదీస్తుంటాడు. అదే సమయంలో చాలా సినిమాలకు స్వయంగా పాటలు కూడా ఆలపించాడు. వీటితో పాటు డైలాగ్ డెలివరీ, ఫైట్స్‌లోనూ సత్తా చాటుతున్నాడు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్ అందుకున్నాడు.

  వరుస విజయాలతో పవర్ స్టార్‌గా

  వరుస విజయాలతో పవర్ స్టార్‌గా

  సుదీర్ఘమైన కెరీర్‌లో పునీత్ రాజ్‌కుమార్ ఎన్నో సినిమాల్లో నటించాడు. బాల నటుడిగానే తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన అతడు.. హీరోగానూ ఎన్నో విజయాలను అందుకున్నాడు. తద్వారా స్టార్ హీరోగా ఎదిగిపోవడంతో పాటు పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇలా చాలా కాలంగా కన్నడంలోనే కాకుండా దక్షిణాది మొత్తం పాపులర్ అయిపోయాడు.

  యువరత్నతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

  యువరత్నతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

  పునీత్ రాజ్‌కుమార్ ఇటీవలే ‘యువరత్న' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. సంతోష్ అనంద్‌రామ్ తెరకెక్కించిన ఈ సినిమాను ‘KGF' సినిమాను నిర్మించిన హోంబళే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. సాయేషా సైగల్ హీరోయిన్‌గా చేసింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం తెలుగులో పరాజయం పాలైంది. దీంతో వారం తిరగక ముందే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.

  పవన్ కోసం పేరు మార్చుకున్నాడు

  పవన్ కోసం పేరు మార్చుకున్నాడు

  పునీత్ రాజ్‌కుమార్ ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తెలుగు హీరోలతో తనకున్న అనుబంధాన్ని వివరించాడు. ఈ నేపథ్యంలోనే తన పేరు ముందు ఉన్న పవర్ స్టార్ బిరుదును తీసేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి కారణం పవన్ కల్యాణ్ అని తెలిపాడు. ‘ఇకపై నన్ను పవర్ స్టార్ అని పిలవకండి. పవర్ స్టార్ అంటే పవన్ కల్యాణ్ సారే' అంటూ వివరించాడు.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  కలిసినప్పుడు అవి గుర్తు చేశారంటూ

  కలిసినప్పుడు అవి గుర్తు చేశారంటూ

  ఇదే ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ సార్‌ను నేను చాలా సార్లు కలిశాను. ఆ సమయంలో ఆయనెంతో ఆప్యాయంగా మాట్లాడతారు. నా చిన్నప్పటి సినిమాలను కూడా చూశానని చెప్పడం సంతోషంగా ఉంటుంది. ఆయన చాలా మంది వ్యక్తి. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు' అంటూ చెప్పుకొచ్చాడు.

  English summary
  Kannada Star Hero Puneeth Rajkumar Have Huge Fan Base. Now He Decided to Change Power Star Name for Tollywood Star Hero Pawan Kalyan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X