Power Star Puneeth Rajkumar కు గుండెపోటు.. జిమ్‌లో కుప్పకూలిపోయిన హీరో.. ఆస్పత్రి వద్ద టెన్షన్ టెన్షన్

కన్నడంలో చాలా కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న సీనియర్ హీరో రాజ్‌కుమార్ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు అక్కడ స్టార్‌గా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. చిన్న వయసులోనే తనదైన శైలి నటనతో మెప్పించిన అతడు.. ఇప్పటికీ కన్నడ ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా డ్యాన్స్‌లో కొత్త ఒరవడిని క్రియేట్ చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. ఇంతటి పేరు ప్రఖ్యాతలతో శాండిల్‌వుడ్‌లో తిరుగులేని హీరోగా ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పునీత్‌కు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

గుండెపోటుకు గురైన పవర్ స్టార్

గుండెపోటుకు గురైన పవర్ స్టార్

సుదీర్ఘ కాలంగా కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తాజాగా గుండెపోటుకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం అతడికి ఛాతిలో నొప్పి రావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ వైద్యులు ఈ స్టార్ హీరో ఐసీయూకు తరలించారని.. అక్కడే చికిత్సను అందిస్తున్నారని తెలిసింది.

ఆస్పతి వద్ద టెన్షన్ వాతావరణం

ఆస్పతి వద్ద టెన్షన్ వాతావరణం

పునీత్ రాజ్‌కుమార్‌ అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న వెంటనే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే అతడు చికిత్సను తీసుకుంటోన్న విక్రమ్ ఆస్పత్రి దగ్గరకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అక్కడికి చాలా మంది అభిమానులతో పాటు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు.

 జిమ్‌లో కుప్పకూలిపోయిన హీరో

జిమ్‌లో కుప్పకూలిపోయిన హీరో

పునీత్ రాజ్‌కుమార్ తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేకమైన శ్రద్దను చూపిస్తుంటాడు. అందుకే ప్రతిరోజూ చాలా గంటల పాటు జిమ్‌లో కసరత్తులు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నాడట. ఆ సమయంలోనే పునీత్‌కు ఛాతినొప్పి వచ్చిందని.. ఆ వెంటనే అక్కడ కుప్పకూలిపోయాడని తెలుస్తోంది. దీంతో అక్కడి వాళ్లే అతడిని ఆస్పత్రికి తరలించారని టాక్.

త్వరగా కోలుకోవాలంటూ పోస్టు

త్వరగా కోలుకోవాలంటూ పోస్టు

పునీత్ రాజ్‌కుమార్ బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. తన టాలెంట్‌తో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే, మిగిలిన హీరోలతో కూడా ఎంతో స్నేహంగా ఉంటాడు. అందుకే ఇప్పుడు అతడు అస్వస్థతకు గురవడంతో అందరూ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే, అతడి ఫ్యాన్స్ ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.

పూరీ జగన్నాథ్ సినిమాతో ఎంట్రీ

పూరీ జగన్నాథ్ సినిమాతో ఎంట్రీ

చైల్డ్ ఆర్టిస్టుగా సత్తా చాటిన పునీత్ రాజ్‌కుమార్.. 2002లో 'అప్పు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది అంతకు ముందే తెలుగులో 'ఇడియట్' పేరుతో వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఘనమైన ఆరంభాన్ని అందుకున్న అతడు.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్లాడు.

Recommended Video

Sharukh ని Atlee కాపాడతాడా? | Pathan Movie కి 100 కోట్లు
అలా తెలుగులోకి.. ఇప్పుడు ఇదే

అలా తెలుగులోకి.. ఇప్పుడు ఇదే

పునీత్ రాజ్‌కుమార్ ఈ ఏడాది ఆరంభంలోనే 'యువరత్న' అనే సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయం అయ్యాడు. అయితే, ఈ సినిమా ఇక్కడ పెద్దగా ఆడలేదు. ఇక, ఇప్పుడు ఈ స్టార్ హీరో చేతన్ కుమార్ దర్శకత్వంలో 'జేమ్స్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ కోసమే పునీత్ సన్నద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X