Puneeth Rajkumar No More: గుండెపోటుతో పునీత్ కన్నుమూత.. బయటకొచ్చిన ఫొటో.. అప్పుడే అధికారిక ప్రకటన

కన్నడ సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా వెలుగొందుతోన్న పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడికి బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పునీత్ చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. దీంతో అసలేం జరుగుతుందో తెలియక అతడి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, ఆ ఆస్పత్రికి చేరుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఈ స్టార్ హీరో త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పునీత్ రాజ్‌కుమార్ మరణించాడని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఫొటో కూడా బయటకు వచ్చింది. దీంతో అతడి ఫ్యాన్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటంటే!

వర్కౌట్ చేస్తుండగా గుండెపోటు

వర్కౌట్ చేస్తుండగా గుండెపోటు

స్టార్ హీరో అయిన పునీత్ రాజ్‌కుమార్ తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేకమైన శ్రద్దను చూపిస్తుంటాడు. అందుకే ప్రతిరోజూ జిమ్‌లో కసరత్తులు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నాడట. ఆ సమయంలోనే పునీత్‌కు ఛాతినొప్పి వచ్చిందని.. ఆ వెంటనే అక్కడ కుప్పకూలిపోయాడని తెలుస్తోంది. దీంతో అక్కడి వాళ్లే అతడిని ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రికి తరలించిన సిబ్బంది

ఆస్పత్రికి తరలించిన సిబ్బంది

సుదీర్ఘ కాలంగా కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తాజాగా గుండెపోటుకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం అతడికి ఛాతిలో నొప్పి రావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఈ స్టార్ హీరో ఐసీయూకు తరలించారు. అక్కడే చాలా సేపు కూడా చికిత్సను అందిస్తున్నారని తెలిసింది.

గుండెపోటుతో పునీత్ మరణం

గుండెపోటుతో పునీత్ మరణం

శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్లు చేసే సమయంలో గుండెపోటుకు గురైన పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాసను విడిచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆస్పత్రికి తీసుకుని వచ్చిన సమయంలోనే పునీత్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడని.. దీంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్సను అందించినా ఫలితం లేకుండా పోయిందని తెలిసింది.

బయటకు వచ్చిన పునీత్ ఫొటో

బయటకు వచ్చిన పునీత్ ఫొటో

పునీత్ రాజ్‌కుమార్ చనిపోయాడన్న వార్తపై అధికారిక ప్రకటన రాకపోయినా.. అతడు ఇకలేడని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో తాజాగా పునీత్ డెడ్ బాడీ అంటూ ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా పునీత్ చనిపోయాడని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక, ఇప్పటికీ ఆయన అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తూనే ఉన్నారు.

అప్పుడే అధికారిక ప్రకటన అని

అప్పుడే అధికారిక ప్రకటన అని

బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తీసుకొచ్చిన కొద్ది సేపటికే పునీత్ రాజ్‌కుమార్ మరణించాడని శాండిల్‌వుడ్ వర్గాల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన ప్రకటన మాత్రం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాబోతుందని తెలిసింది. అప్పటి వరకూ కర్నాటక ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించడంతో పాటు తగు చర్చలు తీసుకోబోతుందని అంటున్నారు.

చిన్న వయసులోనే పరిచయం

చిన్న వయసులోనే పరిచయం

కన్నడంలో చాలా కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న సీనియర్ హీరో రాజ్‌కుమార్ తనయుడే పునీత్. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డును సైతం అందుకున్నాడు. ఇలా చిన్న వయసులోనే చాలా కాలం పాటు అదరగొట్టేశాడు.

అప్పు సినిమాతో హీరోగా ఎంట్రీ

అప్పు సినిమాతో హీరోగా ఎంట్రీ

పునీత్ రాజ్‌కుమార్.. 2002లో 'అప్పు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది అంతకు ముందే తెలుగులో 'ఇడియట్' పేరుతో వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఘనమైన ఆరంభాన్ని అందుకున్న అతడు.. ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.

Recommended Video

Varudu Kavalenu Movie Team Interview
తెలుగు వాళ్లకు అలా పరిచయం

తెలుగు వాళ్లకు అలా పరిచయం

పునీత్ రాజ్‌కుమార్ ఈ ఏడాది ఆరంభంలోనే 'యువరత్న' అనే సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయం అయ్యాడు. అయితే, ఈ సినిమా ఇక్కడ పెద్దగా ఆడలేదు. ఇక, ఇప్పుడు ఈ స్టార్ హీరో చేతన్ కుమార్ దర్శకత్వంలో 'జేమ్స్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ కోసమే పునీత్ సన్నద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X