twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవును.. సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకునే ముందు ఫోన్ చేసింది.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

    |

    సిల్క్ స్మిత అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. బోల్డ్ పాత్రలతో ఒకప్పుడు ప్రతి సినిమా ఇండస్ట్రీలలో ఒక వెలుగు వెలిగిన ఆమె అప్పట్లో కుర్రాళ్లను తెగ ఆకర్షించారు. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్న సిల్క్ స్మిత జీవితం ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. కథానాయికగా ఒక వెలుగు వెలగాలని అనుకున్న ఆమె జీవితం ఎన్నో ట్విస్టులతో కొనసాగింది.

    Recommended Video

    Kannada star Hero Ravichandran on Silk Smitha's Last Phone Call
    డేరింగ్ గర్ల్..

    డేరింగ్ గర్ల్..

    1979లో ఒక మలయాళం సినిమాతో వెండితరకు పరిచయమైన సిల్క్ స్మిత అతి తక్కువ కాలంలోనే ఎవరు ఊహించని క్రేజ్ అందుకుంది. చూస్తుండగానే సౌత్ లో బిజీగా మారిపోయింది. తెలుగమ్మాయిలు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటారనే కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చేలా బోల్డ్ రోల్స్ చేసిన డేరింగ్ గర్ల్ సిల్క్ స్మిత.

    అక్కడ కూడా బిజీబిజీ..

    అక్కడ కూడా బిజీబిజీ..

    సిల్క్ స్మిత ఎక్కడ అడుగుపెట్టినా కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ తన వయ్యారాలతో ఎంతగానో ఆకర్షించేది. బాలీవుడ్ సినిమాల్లో కూడా స్పెషల్ పాత్రల్లో మెరిసిన సిల్క్ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో అక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు తమిళ్ మలయాళం అని తేడా లేకుండా అవకాశాలు వచ్చిన ప్రతి చోట ఆమె తన టాలెంట్ ని బయటపెట్టేది.

     సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్..

    సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్..

    సిల్క్ స్మిత జీవితం గురించి ఇటీవల కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ స్పందించాడు. సిల్క్ స్మిత తనకు మంచి స్నేహితురాలని చెప్పిన ఆ హీరో ఆమె చనిపోయే ముందు రోజు తనకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అయితే తాను బిజీగా ఉండడం వల్ల స్పందించలేకపోయానని చెబుతూ.. తర్వాత మాట్లాడాలని అనుకున్నానని చెప్పారు. బహుశా ఆ రోజు నేను ఒక స్నేహితుడిగా ఆమెతో మాట్లాడి ఉంటే పరిస్థితి మరోలా ఉండదేమో అని రవిచంద్రన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

     ఆమె మరణం ఒక మిస్టరీ..

    ఆమె మరణం ఒక మిస్టరీ..

    సిల్క్ స్మిత జీవిత ఆధారంగా డర్టీ పిక్చర్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. విద్యా భాలన్ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారణ అయినప్పటికీ ఆమె చావు అప్పట్లో ఎన్నో అనుమానాలను కలుగజేసింది. చాలా మంది సినీనటులు ఆమె మరణం ఒక మిస్టరీగానే ఉండిపోయినట్లు పలు ఇంటర్వ్యూలలో అనుమానం వ్యక్తం చేశారు.

    English summary
    Recently, Kannada star hero Ravichandran responded to Silk Smitha's life. The hero, who told Silk Smitha that he was a good friend, phoned her the day before she died. However, he said that he was unable to respond because he was busy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X