పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ దర్శకుడు.. అతనైతేనే కరెక్ట్!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం అభిమానులతో పాటు సినీ ప్రపంచాన్ని కూడా ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది. అంత త్వరగా తనువు చాలించడం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎంతో ఆరోగ్యంగా ఉండే పునీత్ రాజ్ కుమార్ హటాత్తుగా గుండెపోటుతో మరణించడంపై స్టార్ సెలబ్రిటీలు కూడా ఎంతో మనో వేదనకు గురి అవుతున్నారు. అయితే పునీత్ రాజ్ కుమార్ చేసిన మంచి పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక ఆయన బయోపిక్ ను వెండితెరపైకి తీసుకురావాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు దర్శకుడు వివరణ ఇచ్చాడు.

తెలుగు వారితో ప్రత్యేక అనుబంధం

తెలుగు వారితో ప్రత్యేక అనుబంధం

కన్నడ పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పునీత్ రాజ్ కుమార్ ఎంత మంచి వారో కన్నడ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్ లో ఉన్న మిగతా ప్రేక్షకులు కూడా బాగా తెలుసు. దాదాపు ఇండియన్ సినిమా టాప్ సెలబ్రిటీలు అందరూ కూడా ఆయన మృతిపై ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమతో రాజ్ కుమార్ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉండడంతో పలువురు స్టార్ హీరోలు కూడా పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

హఠాత్తుగా చనిపోవడంతో..

హఠాత్తుగా చనిపోవడంతో..

పునీత్ రాజ్ కుమార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మనోవేదనకు గురి అవుతున్నారు. అలాంటి మంచి వ్యక్తి హఠాత్తుగా చనిపోవడం ఒక అబద్దం అని అనుకుంటున్నట్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇక పునీత్ చేసిన మంచి పనులు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అతను ఎంత మంచి వారో మొన్నటివరకు కన్నడ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ప్రపంచానికి కూడా ఆయన స్థాయి ఏమిటో అర్థమవుతుంది.

తెరపైకి పునీత్ బయోపిక్..

తెరపైకి పునీత్ బయోపిక్..


ఎంతోమంది పేద రైతులకు అలాగే పేద విద్యార్థులకు కూడా పునీత్ రాజ్ కుమార్ అండగా నిలిచాడు. దాదాపు 1800 మంది విద్యార్థులను చదివిస్తున్న ఆ బాధ్యతను ఇటీవల తమిళ హీరో విశాల్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పునీత్ రాజ్ కుమార్ జీవితాన్ని తెరపైకి తీసుకు వస్తే ఒక నివాళి అర్పించి నట్లుగా ఉంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక అదే విషయంపై ఇటీవల ఒక స్టార్ దర్శకుడిని అభిమాని కూడా ప్రత్యేకంగా కోరగా ఆ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

Recommended Video

Puneeth Rajkumar Biography.. Appu అజరామరం.. తండ్రిలాగే కళ్ళు దానం ! || Filmibeat Telugu
మీరు మాత్రమే న్యాయం చేయగలరు

మీరు మాత్రమే న్యాయం చేయగలరు

పునీత్ రాజ్ కుమార్ తో కన్నడ స్టార్ డైరెక్టర్ సంతోష్ ఆనంద్ కు మంచి అనుబంధం ఉంది. వీరి కలయికలో రెండు బాక్సాఫీస్ హిట్స్ వచ్చాయి. అయితే ఇటీవల ఒక నెటిజన్, సంతోష్ గారు మీరు పునీత్ రాజ్ కుమార్ గారి బయోపిక్ తియ్యండి అంటూ.. మీరు మాత్రమే ఆ సినిమాకు సరైన న్యాయం చేయగలరు అంటూ ప్రత్యేకంగా కోరడంతో అందుకు దర్శకుడు కూడా అదే తరహాలో సమాధానమిచ్చాడు. తప్పకుండా నా శక్తీ మేరకు ప్రయత్నం చేస్తాను అని అలాంటి మంచి కథను తెర పైకి తీసుకు రావడం మంచి ఐడియా అని కూడా వివరణ ఇచ్చారు. మరి పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X