twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సొంత పార్టీ ప్రకటించేసాడు: మరో స్టార్ హీరో పొలిటికల్ పార్టీ KPJP

    విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ ఉన్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర రాజకీయ రంగప్రవేశం చేశారు. 'కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ' పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు.

    |

    సినిమా తారలంతా రాజకీయాల్లోకి రావటానికి తహ తహలాడుతున్నారు ఇప్పటికే తమిళ నాట రజినీకాంత్, కమల హాసన్ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. కమల్ ఇప్పటికే సొంత పార్టీ అనే నిర్ణయం లో ఉండగా రజినీకాంత్ ఇంకా ఏ నిర్నయమూ తేల్చనే లేదు.. ఇక మనదగ్గర పవన్ చురుకుగా పావులు కదుపుతూనే ఉన్నాడు.

    కన్నడ హీరో ఉపేంద్ర

    కన్నడ హీరో ఉపేంద్ర

    వీళ్ళంతా ఎవరి హడావిడిలో వాళ్ళుండగానే గప్ చిప్ గా తన పార్టీ ని ప్రకటించేసాదు కన్నడ హీరో ఉపేంద్ర. విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ ఉన్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర రాజకీయ రంగప్రవేశం చేశారు. 'కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ' పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు.

     బెంగళూరు గాంధీభవన్

    బెంగళూరు గాంధీభవన్

    పార్టీ లోగోను కూడా ఆవిష్కరించి సిద్ధాంతాలను కూడా ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరులోని గాంధీభవన్ వేదికైంది.రాజకీయరంగంలో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందని.. దాన్ని అంతం చేసేందుకు శాయశక్తులా పోరాటం చేస్తామని ఉపేంద్ర ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

    పేద ప్రజల సేవే లక్ష్యంగా

    పేద ప్రజల సేవే లక్ష్యంగా

    ప్రజాప్రతినిధులు ఉన్నత విద్యావంతులై ఉంటేనే మంచిదని అభిప్రాయపడ్డారు. రైతుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని ఉపేంద్ర పేర్కొన్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం, పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా ఉపేంద్ర పేర్కొన్నారు.

     ఇది ప్రజల పార్టీ

    ఇది ప్రజల పార్టీ

    ఇది తన పార్టీ కాదని, ప్రజల పార్టీ అని తెలిపారు. ప్రజల కోసం తాను ఒక వేదికను మాత్రమే సిద్ధం చేశానని... తన లక్ష్యాలతో ఏకీభవించేవారంతా పార్టీలో భాగస్వాములు కావచ్చని, సమాజంలో మార్పును తీసుకురావడమే తన కల అని చెప్పారు. ఉపేంద్ర అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అందరూ ఖాకీ షర్టులను ధరించారు.

     విద్యావంతులై ఉంటేనే మంచిది

    విద్యావంతులై ఉంటేనే మంచిది

    రాజకీయరంగంలో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందని... దాన్ని అంతం చేయడానికి శాయశక్తులా పోరాటం చేస్తామని చెప్పిన ఉపేంద్ర. ప్రజాప్రతినిధులు ఉన్నత విద్యావంతులై ఉంటేనే మంచిదని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమానికి ఉపేంద్ర భార్య ప్రియాంక కూడా హాజరయ్యారు.

    English summary
    Upendra said the KPJP (Karnataka Pragnyavantha Janatha Paksha) was a platform for the people, and welcomed anyone with ideas for bettering society to contribute to it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X