స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నాడు. ఇన్నాళ్లు షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. అంతకు ముందు లాక్డౌన్ అంటూ నాలుగు గోడల మధ్యే గడిపాడు. ఇప్పుడు షూటింగ్‌లు కూడా అయిపోవడంతో ఎంచక్కా అలా ఫ్యామిలీని తీసుకొని వెకేషన్‌కు బయల్దేరాడు రాకీ భాయ్. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక మన తారలందరూ కూడా వరుసబెట్టి మాల్దీవులకు వెళ్లారు. ఇప్పుడు యశ్ వంతు వచ్చింది.

Recommended Video

KGF Chapter 2 Teaser Smashing YouTube Records | Happy Birthday Yash | Filmibeat Telugu
అందరూ అక్కడికే..

అందరూ అక్కడికే..

ప్రస్తుతం మన తారలందరూ కూడా మాల్దీవుల్లోనే ఎంజాయ్ చేసివచ్చారు. కొత్తగా పెళ్లైన జంటలు హనీమూన్ కోసం, దాదాపు తొమ్మిది నెలలు ఇంట్లోనే ఉంటూ విసిగిపోయిన తారలు కూడా కాస్త ప్రశాంత కోసం బయటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం కోసమో ఏమోగానీ అందరూ మాల్దీవులకే వెళ్లారు.

ఆ జాబితాలో..

ఆ జాబితాలో..

అలా మాల్దీవులకు వెళ్లిన వారిలో రకుల్ ఫ్యామిలీ, తాప్సీ, ప్రణీత, కాజల్-గౌతమ్, నిహారిక-చైతన్య. సమంత-నాగ చైతన్య ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇలా అందరూ వెళ్లేందుకు కూడా ఓ స్పెషల్ కారణం ఉన్నట్టుంది. మాల్దీవుల్లోటూరిజం డెవలప్ మెంట్ కోసం ఇలా తారలందరికీ ప్యాకెజ్ ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు రాకీ భాయ్ కూడా అక్కడికే వెళ్లినట్టున్నారు.

 కేజీయఫ్ చాప్టర్ 2 ఫూర్తి..

కేజీయఫ్ చాప్టర్ 2 ఫూర్తి..

కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తయిందన్న సంగతి తెలిసిందే. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. యశ్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన టీజర్ ఇప్పటి వరకున్న రికార్డులన్నింటిని బద్దలయ్యాయి.

ఫుల్ ఖుషీ..

ఫుల్ ఖుషీ..

చాప్టర్ 2 టీజర్ ఫుల్ సక్సెస్ అవ్వడంతో టీం మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో యశ్ కూడా కాస్త విశ్రాంతి తీసుకోవాలిని నిర్ణయించుకున్నట్టున్నాడు. అందుకు యశ్ తన ఫ్యామిలీని తీసుకుని మాల్దీవులకు చెక్కేశాడు.

స్వర్గమంటూ ఉంటే..

స్వర్గమంటూ ఉంటే..

మాల్దీవుల్లో తన ఫ్యామిలీతో దిగిన యశ్ అక్కడ రచ్చ చేయడంప్రారంభించాడు. స్వర్గమంటూ ఉంటే అది ఇదే అంటూ మాల్దీవుల అందాలను ప్రశంసించాడు. మొత్తానికి యశ్ ఇప్పుడు ఫ్యామిలీమెన్ మూడ్‌లో ఉన్నాడు. పిల్లలు, భార్యతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X