KGF 2 Trailer: RRR, ప్రభాస్ సినిమాల రికార్డులను బ్లాస్ట్ చేసిన యష్.. ఇది మామూలు అరాచకం కాదు

ఒక కన్నడ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించే సమయం త్వరలోనే రాబోతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల విడుదలైన KGF చాప్టర్ 2 ట్రైలర్ ఊహించని విధంగా రెస్పాన్స్ అందుకుంటుంది. అసలు ట్రైలర్ కు మొదట కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా 17 గంటల్లోనే మిగతా సినిమాల ట్రైలర్స్ రికార్డులను కూడా బ్లాస్ట్ చేయడం విశేషం. అంతే కాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం RRR ప్రభాస్ సినిమాలు 24 గంటల్లో క్రియేట్ చేసిన రికార్డును యష్ 15 గంటల్లోనే బ్రేక్ చేశాడు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

KGF Chapter 2 Trailer Sensational Record మామూలు అరాచకం కాదు | Filmibeat Telugu
కన్నడ ఆడియెన్స్ మాత్రమే కాకుండా..

కన్నడ ఆడియెన్స్ మాత్రమే కాకుండా..

ఒక బస్సు డ్రైవర్ కొడుకు కన్నడ స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు అని ఎవరూ ఊహించి ఉండరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన యష్ ఒక్క KGF సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారే స్థాయికి వచ్చాడు. ప్రస్తుతం KGF 2 కోసం కేవలం కన్నడ ప్రేక్షకుల మాత్రమే కాకుండా మిగతా భాషల్లో చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు అని ఇటీవల విడుదలైన ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది.

భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం

భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం

కన్నడ లో కంటే ఈ సినిమా ట్రైలర్ కు హిందీ లోనే ఎక్కువగా వ్యూవ్స్ రావడం విశేషం. అంతే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో వ్యూవ్స్ లభించడంతో ఈ సినిమాకు మిగతా భాషల్లో డిమాండ్ అయితే మామూలుగా లేదు అని అర్థమైంది. ఒక విధంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 రికార్డులు బ్రేక్

రికార్డులు బ్రేక్

KGF 2 ను ప్రశాంత్ అంతకుమించి అనేలా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది. ముఖ్యంగా యాక్షన్ డోస్ అయితే మామూలుగా లేదు. తప్పకుండా పాన్ ఇండియా లెవెల్ లో హీరో యష్ నెవర్ బిఫోర్ అనేలా రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ట్రైలర్ RRR, రాధే శ్యామ్ సినిమాలకు సంబంధించిన అన్ని రికార్డులను బ్రేక్ చేసేసింది.

15 గంటల్లోనే అరాచకం..

15 గంటల్లోనే అరాచకం..

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా రూపొందిన రాజమౌళి RRR సినిమా ట్రైలర్ 24 గంటల్లో అన్ని భాషల్లో కలుపుకొని 51.12 మిలియన్ల వ్యూవ్స్ సాధించగా ఆ తర్వాత ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ట్రైలర్ 57.5 మిలియన్ల వ్యూవ్స్ సాధించి ఆ రికార్డును బ్రేక్ చేసేసింది. ప్రభాస్ సినిమా సినిమా 24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న సినిమాగా నిన్నటివరకు అగ్రస్థానంలో ఉండగా యష్ KGF ఆ రికార్డును కేవలం 15 గంటల్లోనే బ్రేక్ చేసింది.

 ఇండియాలోనే నెంబర్ వన్ రికార్డు

ఇండియాలోనే నెంబర్ వన్ రికార్డు

KGF చాప్టర్ 2 ట్రైలర్ 15 గంటల్లోనే ఇండియాలోనే నెంబర్ వన్ ట్రైలర్ గా రికార్డును క్రియేట్ చేసింది. RRR, రాధేశ్యామ్ సినిమాలు సాధించిన రికార్డును పదిహేను గంటల్లోనే బ్రేక్ చేయడం విశేషం. 15 గంటల 70 మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న KGF చాప్టర్ 2 ట్రైలర్ మొత్తంగా 24 గంటల్లో 109మిలియన్ల వ్యూవ్స్ తో నెంబర్ వన్ రికార్డును సొంతం చేసుకుంది. ఇక సినిమా ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X