twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఘోర రోడ్డు ప్రమాదం: ప్రముఖ టీవీ నటితో పాటు ఐదుగురు దుర్మరణం

    |

    కన్నడ టీవీ నటి శోభ, మరో నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. చిత్రదుర్గ శివారులో బుధవారం(జులై 17) ఈ ఘటన చోటు చేసుకుంది. 4వ నెంబర్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

    ఒక మల్టీ పర్సస్ వెహికిల్‌లో శోభతో పాటు మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. చిత్రదుర్గ శివారులోని కుంచినగనలు వద్ద జరిగిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా.... ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.

    మరణించిన వ్యక్తులు వీరే...

    మరణించిన వ్యక్తులు వీరే...

    మరణించిన వారిని టీవీ నటి శోభ(45), అశోక్(35), శ్యామల(64), సుకన్య(67), మంజులా(45), పవిత్ర930), శ్రేష్ఠ(7), ఆర్థత్(2)టగా గుర్తించారు. గాయపడిన వారిని చిత్రదుర్గలోని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు.

    ఆలయానికి వెళుతుండగా ఘటన

    ఆలయానికి వెళుతుండగా ఘటన

    రాజేశ్వరినగర్ ప్రాంతానికి చెందిన వీరంతా బాలాకోట్ జిల్లా బదామి తాలూకాలోని బనాశంకరి దేవాలయానికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. కారు టైరు పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు గుర్తించారు.

    శోభ ఎవరు?

    శోభ ఎవరు?

    ప్రముఖ ఫిల్మ్ మేకర్ టిఎన్ సీతారామ్ రూపొందిస్తున్న టీవీ సీరియల్ మగలు జనక్కిలో శోభ నటిస్తున్నారు. ఇందులో ఆమె మంగళ అనే పాత్ర పోషిస్తోంది. తన సహజసిద్ధమైన నటనతో ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

    దర్శకుడు స్పందిస్తూ....

    దర్శకుడు స్పందిస్తూ....

    శోభ మరణంపై టిఎన్ సీతారామ్ స్పందిస్తూ... ‘శోభ చాలా టాలెంటెడ్ యాక్టర్. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. ఈ విషయం తెలిసిన వెంటనే షాకయ్యాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు' తెలిపారు.

    English summary
    Kannada TV actress Shobha and four others died in a car accident on the outskirts of Chitradurga on Wednesday, July 17.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X