కాంతర, KGF స్టార్స్ తో ప్రధాని మోడీ.. ఇంత సడన్ గా ఎందుకు కలిశారంటే?
భారత ప్రధాని మోడీ సినిమా ప్రముఖులను కూడా అప్పుడప్పుడు ప్రత్యేకంగా కలుసుకుంటు ఉంటారు. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేసి ఇండస్ట్రీల స్థాయిని పెంచే సినిమాలు తీసిన ప్రముఖులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో కర్ణాటక సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన సినీ ప్రముఖులను కూడా మోడీ కలుసుకొని వారితో కొంతసేపు కర్ణాటక సంస్కృతి, సాంప్రదాయాలు సినిమాల గురించి కూడా మాట్లాడారు.
ఇక అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నడ భాషల్లో తెరకెక్కిన KGF, కాంతార సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. ఇక ఆ సినిమాలో కథానాయకులుగా నటించిన రాకింగ్ స్టార్ యష్ ను అలాగే కాంతార దర్శకుడు హీరో రిషబ్ శెట్టిని కూడా మోడీ కలుసుకొని వారిని అభినందించారు.

KGF సినిమా భారీ అంచనాల మధ్య రెండు భాగాలుగా రిలీజ్ కాగా కాంతారా ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను పెంచుకుంది. ఇక ఆ విషయంలో ఇద్దరిని కూడా ప్రశంసించారు. కర్ణాటక బెంగళూరులో యెలహంకా ఎయిర్ స్టేషన్ లో ఎయిరో ఇండియా షో ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా పాల్గొనగా ఈ సందర్భంగా కన్నడ సినీ ప్రముఖులు యష్, రిషబ్ శెట్టి కలుసుకున్నారు.
బెంగళూరు లోని రాజ్ భవన్ లో మరికొందరు సినీ ప్రముఖులు కూడా మోడిని కలుసుకోవడం జరిగింది. ఇక ఈ సమావేశంలో పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ రాజ్ కుమార్ ప్రధానిని కలిశారు. ఇక సౌత్ సినిమాలు చాలా వరకు ప్రపంచస్థాయిలో గుర్తింపు అందుకునేలా సినిమాలు చేస్తున్న సినీ కళాకారులపై మోడీ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఇక సాంస్కృతిక కళాకారులు ఇంకా వెలుగులోకి వచ్చేలా సినిమాలు చేయాలని కూడా మోడీ వారికి సూచించారు. ఇక ప్రస్తుతం కాంతార సినిమాకు ఫ్రీక్వెల్ ను తెరపైకి తీసుకు రావడానికి రిషబ్ శెట్టి ప్రయత్నం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











