twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యభిచారం కేసులో "కందిరీగ" నటి యమున అరెస్ట్, విడుదల

    By Nageswara Rao
    |

    వ్యభిచారం కేసులో అడ్డంగా బుక్కయిన దక్షిణాధి సినీ నటి యమునను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం బెయిల్‌పై విడుదల చేశారు. యమున నటించిన కందిరీగ చిత్రం విడుదలకు ఒక్కరోజు ముందే ఇలా జరగింది. బెంగళూరులోని విఠల్ మాల్య రోడ్డులో ఉన్న ఐటీసీ రాయల్ గార్డెనియా అనే ఫైవ్‌స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తుండగా తాము రెడ్‌హ్యాండెడ్‌గా పట్టకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. యమునతోపాటు మరో ఎనిమిది మందిని వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డట్లు తెలిపారు.

    "మాకు అందిన సమాచారం ప్రకారం.. బెంగళూరులోని ఐటీసీ రాయల్ గార్డెనియాలో తనిఖీలు నిర్వహించగా.. నాల్గవ అంతస్థులోని రూమ్ నంబర్ 1402లో వారిని పట్టుకున్నాం. యుమున నుంచి రెండు లక్షల రూపాయల నగదుని, ఆంధ్రప్రదేశ్‌లోని పుత్తూరుకు చెందిన సురక్షిత అనే మహిళ (మధ్యవర్తి) వద్ద నుంచి రూ. 46,000లను, 'ట్రాన్సాఫ్ట్ కాల్ సెంటర్' యజమాని నందకుమార్‌ను అరెస్టు చేశాం. నందకుమార్ టొయోటా కారును, మధ్యవర్తి హ్యుందాయ్ కారును కూడా సీజ్ చేశామ"ని తెలిపారు.

    రూమ్ నంబర్ 1402ను కేవలం ఒక్క గంట కోసం మాత్రమే బుక్ చేశారని, ఆ రూమ్‌కు గంటకు రూ. 28,000 అద్దె అని, ఆ ఒక్క గంటకు గానూ నటికి రెండు లక్షల రూపాయలు రేట్ ఫిక్స్ చేశారని వారు తెలిపారు. మామగారు, మౌన పోరాటం, ఎర్ర మందారం వంటి తెలుగు చిత్రాల్లోనే కాకుండా.. కన్నడలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్ సరసన కూడా యమున పలు చిత్రాల్లో నటించింది. తాజాగా కన్నడలో "కందిరీవ" (కందిరీగ) అనే చిత్రంలో కూడా నటించింది. 21న కందిరీవ విడుదలైంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X