మోహన్ బాబు మా నాన్న కాళ్లు పట్టుకున్నారు: కారణం చెప్పిన రాజా రావు

By Bojja Kumar

ప్రముఖ నటుడు కత్తి కాంతారావు చివరి రోజుల గురించి ఆయన తనయుడు రాజా రావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాన్నగారు చివరగా బాలకృష్ణ గారు హీరోగా తెరకెక్కిన 'పాండురంగడు' చిత్రంలో నటించారని, అందులో మోహన్ బాబు గారు చిన్న గెస్ట్ రోల్ చేశారని, అపుడు మోహన్ బాబుగారు నాన్నగారి కాళ్లు పట్టుకున్నారని రాజారావు గుర్తు చేసుకున్నారు.

నాన్నగారి కాళ్లు మాత్రమే పట్టుకుంటానన్నారట

నాన్నగారి కాళ్లు మాత్రమే పట్టుకుంటానన్నారట

‘పాండురంగడు' సినిమా షూటింగ్ సమయంలో మోహన్ బాబుగారు ఒక మంచి మాట చెప్పారట. ఈ సినిమాలో ఆయనది ఒకరి కాళ్లు పట్టుకునే పాత్ర. నేను ఆ వేషం వేయాలంటే కాంతారావుగారు ఆ పాత్రలో నటించాలి అని షరుతు పెట్టారట. వేరే ఆర్టిస్టు ఎవరైనా ఈ పాత్ర చేయను అని మోహన్ బాబుగారు చెప్పారట. వెంటనే ఆ చిత్ర బృందం నాన్నగారి వద్దకు వచ్చి ఈ విషయం చెప్పి ఆయన్ను నటించడానికి ఒప్పించారు.... అని రాజారావు గుర్తు చేసుకున్నారు.

Recommended Video

Gayatri Movie Review
మోహన్ బాబుతో మంచి అనుబంధం

మోహన్ బాబుతో మంచి అనుబంధం

మోహన్ బాబుగారికి నాన్నగారితో మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబు ఫస్ట్ మూవీ ప్రతిజ్ఞ. మా నాన్నగారు యాక్ట్ చేసిన సినిమా పేరు కూడా ‘ప్రతిజ్ఞ'. ఆయన ఆ షూటింగ్ అప్పుడు నాన్నను బుక్ చేశారు. చేసి ఒకటే చెప్పారు. కాంతారావుగారు మీరు హీరోగా ప్రతిజ్ఞ హిట్టయింది. అందుకని మీ పిక్చర్ పేరు నేను పెట్టుకుంటాను. మీరు నాతో యాక్ట్ చేయాలని అని చేయించారు. అలా ఫస్ట్, లాస్ట్ మోహన్ బాబు గారితో చేశారు. మోహన్ బాబుగారు నాన్న గారి కాళ్లు పట్టేదే చివరి చిత్రం.... అని రాజారావు తెలిపారు.

చాలా పొంగిపోయారు

చాలా పొంగిపోయారు

నాన్నగారు లాస్ట్ మేకప్ వేసింది మోహన్ బాబుతో కలిసి చేసిన పాండురంగడు చిత్రమే. మోహన్ బాబుగారు కాళ్లు పట్టుకునే సీన్ ఆయనతోనే చేస్తాననడంతో నాన్నగారు చాలా పొంగిపోయారు అని రాజా రావు గుర్తు చేసుకున్నారు.

వాణిశ్రీ వల్ల అంతా పోయింది, ఆస్తులు అమ్ముకున్నాం: కాంతారావు తనయుడు రాజా రావు

వాణిశ్రీ వల్ల అంతా పోయింది, ఆస్తులు అమ్ముకున్నాం: కాంతారావు తనయుడు రాజా రావు

వాణిశ్రీ వల్ల అంతా పోయింది, ఆస్తులు అమ్ముకున్నామని కాంతారావు తనయుడు రాజా రావు వెల్లడించారు. ఆయన చెప్పిన

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X