కంత్రీ కామెడీ!!!
యమదొంగ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కంత్రీ. యమదొంగ వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో కంత్రీ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ మధ్యే ఈ సినిమా యూనిట్ హాంగ్ కాంగ్ కు వెళ్లింది. అక్కడ ఫైట్ సీన్స్, పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. యమదొంగ సినిమా కోసం 20కేజీల బరువు తగ్గిన ఎన్టీఆర్ ను కంత్రీ సినిమాలో మరింత విభిన్నంగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ఇందుకోసం తీవ్రంగా కృషిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కామెడీని కూడా పండిస్తున్నట్టు సమాచారం. ఇదే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు కొత్తదనాన్ని తెచ్చే కోణంగా మెహేర్ రమేష్ భావిస్తున్నారు. ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హన్సికా మొత్వానీ, రియా సేన్ నటించనున్నారు.


Click it and Unblock the Notifications











